Karthika Masam : సోమవారం కార్తీక మాసం వ్రతం వలన కోటి యాగాల ఫలితం… దీని నియమాలు, ఏ విధంగా చేయాలో తెలుసుకోండి…!
Karthika Masam : ఈ కార్తీకమాసం కేశివుడికి, శివుడికి ఎంతో ఇష్టమైన నెల అవ్వడంతో ఈ నెలలో భక్తులు ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక మాసం నెల రోజులు ఉపవాసం ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో భగవంతుని స్మరిస్తూ ఉంటారు. అయితే కార్తీక మాస వ్రతాన్ని చేయవలసిన వాళ్లు ప్రధానంగా ఆర్థిక సోమవారంలో చేయవలసిన నియమాలు విధానాలు కార్తిక పురాణంలో చక్కగా తెలపబడింది. జనక మహారాజుకి వశిష్యుడు కార్తీక మాస మహాత్వాన్ని తెలుపుతూ.. కార్తీక మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం వ్రతాన్ని చేసుకునేవాళ్లు తప్పకుండా కైవల్యాన్ని పొందవచ్చు. అని వారికి ముక్తి లభిస్తుందని తెలిపారు. ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు స్నాన, జపాదులను ఆచరించినవారు 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారని వశిష్ట మహర్షి చెప్పారు. కార్తీక సోమవారం రోజు 6 పద్ధతులలో ఏదో ఒక పద్ధతితో కార్తిక సోమవారం వ్రతాన్ని ఆచరిస్తే పుణ్యం దక్కుతుందని వశిష్ట మహర్షి తెలిపారు. ఇక ఆ పద్ధతులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
Karthika Masam : ఈ కార్తీక మాసంలో సోమవార వ్రతానికి ఆరు పద్ధతులలో మరో విధానాలు…
ఫస్ట్ విధానం… మధ్యాహ్నం భోజనాన్ని భుజించి రాత్రి తినకుండా భక్తితో ఉండడం ఇక ఏమీ తీసుకోకుండా కార్తీక సోమవారం దీక్ష చేయడం సాధ్యం కానీ వారికి ఉదయం స్నాన, దాన, జపాలు యధావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలని వశిష్యుడు చెప్పారు. దీనిని ఏకభుక్తము అని ఒక్క పూట భోజనం చేసి భగవంతుని మీద మనసు లగ్నం చేసి నిష్టగా ఆరాధించాలని చెప్పారు. ఇక మరొక విధానంలో భోజనానికి తాము ప్రయత్నం చేయకుండా ఎవరినైనా భోజనం పెడితే ఆ భోజనాన్ని మాత్రమే చేయడానికి ఆయా చిత్తము అని పిలుస్తుంటారు. ఈ విధానంలో కూడా కార్తీక సోమవారం వ్రతాన్ని చేసుకోవచ్చు.
అని వశిష్యుడు చెప్పారు. ఇక ఉపవాసానికి ఉండలేని వారు స్నానా, జపాదులు చేసినప్పటికీ సరిపోతుందని అంటున్నారు. ఇక మంత్ర విధులు కూడా రానివాళ్లు స్నానజపాతులు తెలియని వారు కార్తీక సోమవారం నాడు నువ్వుల నూనె దానం చేసిన సరిపోతుందని వశిష్యుడు జనకుడికి చెప్పడం జరిగింది. మరో విధానం మధ్యాహ్నమంతా ఉపవాసం చేసి ఏమి తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనానికి గాని ఉపహారాన్ని గాని తినడాన్ని నత్తము అని పిలుస్తుంటారు. అని వశిష్యుడు చెప్పారు. అంటే పూర్తిగా ఆహారం లేకుండా దీక్ష చేయడం ఒక్క పూట పగల సమయంలో భోజనం చేసి రాత్రి భోజనం చేయకుండా వ్రతాన్ని చేయడం రోజంతా తినకుండా రాత్రి సమయంలో భోజనం తినడం వలన కార్తీక మాస సోమవారం వ్రతాన్ని చేయవచ్చని సూచించారు.
ఉపవాసం. కార్తిక సోమవారం వ్రత విధానాన్ని చేసే ఆరు పద్ధతుల విషయాలకు వస్తే అది ఉపవాసం ఏకభుక్తము మొత్తం స్నానము, తిలాదానము, అని వశిష్ట మహర్షి చెప్పారు. ఇక వీధి గురించి వెళ్తే శక్తి గలవారు కార్తీక సోమవారం రోజు రోజంతా భోజనం చేయకుండా ఉండి సాయంకాల సమయంలో శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్ధాన్ని మాత్రమే తీసుకోవాలని తెలుపుతున్నారు. దీనిని ఉపవాస దీక్ష అని అంటారని వశిష్ట మహర్షి చెప్పారు.. ఈ కార్తీక సోమవారం రోజు నిష్టగా ఈ ఆరు నియమాలలో దేనిని మీరు ఆచరించిన వాళ్లు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందవచ్చు. అని శివ సాయిజ్యం పొందుతారని వశిష్యుడు జనక మహారాజుకి తెలిపారు. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు సోమవారం వ్రతాన్ని చేస్తూ వస్తున్నారు.