Zodiac Signs : కొత్త సంవత్సరం నుంచి ఈ రాశుల వారికి మహా రాజయోగాన్ని ప్రకటించిన కేతువు..!
ప్రధానాంశాలు:
Zodiac Signs : కొత్త సంవత్సరం నుంచి ఈ రాశుల వారికి మహా రాజయోగాన్ని ప్రకటించిన కేతువు..!
Zodiac Signs : ఖగోళంలో నవగ్రహాలు సంచారం ద్వాదశ రాశులపై ప్రభావం చూపుతాయి. అయితే కొత్త సంవత్సరంలో గ్రహాలు అన్ని రాశులను మార్చుకుంటాయి. అంతేకాకుండా ఈ ఏడాది తిరోగమన దిశలో ప్రయాణించే కేతువు తన రాశిని మార్చుకోనున్నాడు. అనంతరం సింహరాశి లోకి ప్రవేశిస్తాడు. ఇక దీనితో కొన్ని రాశుల వారి కలలు నిజం కాబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాగే ఈ ఏడాది ఆకస్మిత ధన లాభం కలగడంతో పాటుగా గతంలో నిలిచిపోయిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. చాలామంది కేతువు అంటే నీడ గ్రహం అనీ భావిస్తారు. ఇక కేతువు ఆశుభాలనే కాకుండా శుభాలను కూడా ప్రసాదిస్తాడు. ఈ కారణంతో ఈ ఏడాది రెండు రాశుల వారికి మహారాజు యోగం పట్టబోతుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
మీన రాశి : కేతువు కారణంగా మీన రాశి జాతకులకు విశేషమైన రాజయోగం పట్టబోతుంది. ఆర్థికంగా మెరుగుపడటంతో పాటుగా ఈ సమయంలో వీరు చక్రం తిప్పడం ఖాయమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కెరియర్ అద్భుతంగా ఉంటుందని అలాగే పెళ్లి కానీ మీనా రాశి జాతకులకు మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారుల విషయానికొస్తే వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు లభిస్తాయి. అదేవిధంగా సహ ఉద్యోగుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
మిధున రాశి : మిధున రాశి జాతకులకు కేతువు కారణంగా అప్పులన్నీ తీరిపోతాయి. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు. ఆర్థికంగా మెరుగుపడి ఉన్నత స్థాయి కి ఎదుగుతారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరిగి సఖ్యత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. డబ్బుల విషయంలో పొదుపు చేసుకోవడం మంచిది. లేకపోతే భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అంతేకాకుండా బంధుమిత్రులతో విభేదాలు తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మిధున రాశి జాతకులకు ఇది సువర్ణ అవకాశమని చెప్పుకోవచ్చు.