Kula Devatha : ప్రతి ఇంటికి కులదైవం ఉంటుంది… అసలు ఎందుకు వీరిని మొక్కాలో తెలుసా…?
ప్రధానాంశాలు:
Kula Devatha : ప్రతి ఇంటికి కులదైవం ఉంటుంది... అసలు ఎందుకు వీరిని మొక్కాలో తెలుసా...?
Kula Devatha : కులదేవత అంటే చాలామంది కూడా కులానికి సంబంధించిన దేవత అనుకుంటారు కానీ ఇది కాదు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, దేవత అంటే వంశాచారాన్ని బట్టి వస్తుంది. అన్నకు రాముడిని ఇక్ష్వాకు కుల తిలక అంటారు కదా, నాగన్న మాట ఇక్కడ కులం అంటే కుటుంబం అని అర్థం.ఇంటి ఇలవేల్పు అనే అర్థం కూడా వస్తుంది.
కులదేవత అంటే, మీ పూర్వీకుల నుంచి తరతరాలుగా భక్తితో కొలిచే దేవత. మీకు ఇతర దేవుళ్ళను కొలిచిన, మీకు కొందరు ఇష్ట దైవాలు ఉన్నా కూడా కులదైవం ఎంతో ప్రత్యేకం. మీ పూర్వీకులు తరతరాలుగా కొలుస్తూ వస్తున్న దేవతలను ఆరాధిస్తే మీకు వచ్చే కష్టాలు త్వరగా తొలగిపోతాయి. అలాగే,దేవతలు పిలిస్తే పలుకుతారు. ఈ కుల దేవతల గొప్పతనం ఎవరైతే మరువకుండా కులదేవతలను పూజిస్తారో వారికి సకల సంపదలు ప్రాప్తిస్తాయి. ఈ పెద్దలు చెబుతూ ఉంటారు. కుటుంబంలో ఎటువంటి శుభకార్యం చేయాలన్నా మొదట కుల దేవతను పూజించాల్సి ఉంటుంది.ఇలా పూజిస్తే మీరు చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది.

Kula Devatha : ప్రతి ఇంటికి కులదైవం ఉంటుంది… అసలు ఎందుకు వీరిని మొక్కాలో తెలుసా…?
Kula Devatha ప్రస్తుత కాలంలో కులదైవం ప్రాముఖ్యత
నేటి కాలంలో చాలామందికి కూడా కులదైవం అంటే ఏమిటో కూడా తెలియదు. మన పెద్దలు ఇలవేల్పులను,మనకు వారసత్వంగా సంపదగా ఇస్తారు. వారి అనుగ్రహం పొందాలంటే మాత్రం మన చేతుల్లోనే ఉంది.
వంశపరంపర,ఆధ్యాత్మిక బంధం : దైవాలు మన పూర్వీకులతో లోతైన ఆధ్యాత్మిక బంధాన్ని కలిగి ఉంటుంది కుటుంబంలోని ప్రతి తరానికి దేవత ఆరాధన ఒక సాంప్రదాయకంగా వస్తుంది. మీకు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు తరతరాల భక్తి ఇంకో చోట కేంద్రీకృతమై ఉంటుంది మీ వంశంలోని వారందరూ ఏకమయి ఒకే దేవతలను కొలవడం వల్ల ఆ ప్రార్ధనలకు ఎక్కువ శక్తి ఉంటుందని నమ్ముతారు. మీ కుటుంబ సభ్యుల మధ్య కూడా ఒక రకమైన ఐక్యత ఏర్పడుతుంది.
శీఘ్ర ఫలితాలు, ఆశీస్సులు : మీ పూర్వికులు తరతరాలుగా చేసిన నిరంతర భక్తి పూజల వల్ల, దైవం ఆ కుటుంబం పై ప్రత్యేక అనుగ్రహాన్ని కలిగిస్తుంది.అందుకే మీకు ఏదైనా కష్టం లేదా ఆపద వచ్చినప్పుడు మీరు కులదైవాన్ని ప్రార్థిస్తే వారు త్వరగా స్పందించి. మీకు సహాయం చేస్తారని నమ్ముతారు. ఇతర దేవతలను ప్రార్థించినప్పటికీ కులదైవం తమ వంశానికి చెందిన వారికి, మరింత త్వరగా సహాయం చేస్తుందని ప్రతిదీ ఇది మీ ప్రార్థనలకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత నిస్తుంది.
రక్షణ కవచం,కుటుంబ శ్రేయస్సు : దైవాన్ని ప్రార్థిస్తే కుటుంబాన్ని దుష్టశక్తుల నుండి ఆపదల నుండి కాపాడుతుంది అలాగే ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్న ఆర్థిక సమస్యలు తో బాధపడుతున్న, ఇంకా వివాహ సంబంధిత సమస్యలు ఉన్నా, మరి ఇతర కుటుంబ కష్టాలు ఉన్న కులదైవాన్ని ప్రార్థిస్తే,సానుకూల ఫలితాలు తప్పక కలుగుతాయి అంటున్నారు పండితులు. ఇది కేవలం ఆధ్యాత్మిక రక్షణ మాత్రమే కాదు,కుటుంబ సభ్యుల మానసిక స్థాయిని కూడా పెంచగలదు.
సాంస్కృతిక వారసత్వం, గుర్తింపు : దైవ ఆరాధన కేవలం మతపరమైనదే కాదు మన సంస్కృతి సాంప్రదాయంలో ఒక అంతర్భాగం కులదైవాన్ని పూజిస్తే అంటే మన పూర్వీకుల వారసత్వాన్ని గౌరవించిన వారు అవుతాం ఇది కుటుంబ సభ్యులకు వారి మూలాలను గుర్తింపులను తెలియజేస్తుంది. ఆచారాలను పాటించడం ద్వారా భవిష్యత్తు తరాలకు కూడా ఈ గొప్ప వారసత్వాన్ని అందించిన ఆరవుతారు కాబట్టి మన సంస్కృతిక, కుటుంబ బంధాలు మరింత బలోపేతం అవుతాయి. మీ కులదైవాన్ని తెలుసుకొని వారికి నిత్యం పూజలు చేస్తే మీ కుటుంబానికి శుభం చేకురుతుంది. ఇది కేవలం విశ్వాసం మాత్రమే కాదు,మీ వంశపారాయపరంగా నిలబెట్టే ఒక గొప్ప బాధ్యత. కాబట్టి, మీరు ఏ శుభకార్యం తలపెట్టినా కూడా మీ కుల దేవతను ముందుగా పూజించడం మరచిపోవద్దు. కులదేవతను కాదని మీరే ఇతర దేవులకు పూజించినా కానీ ఫలితం ఉండదు.