Lakshmi Devi : ఆదివారం కార్తీక త్రయోదశి రోజున‌ రూపాయి బిళ్ళతో ఇలా చేశారంటే… ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lakshmi Devi : ఆదివారం కార్తీక త్రయోదశి రోజున‌ రూపాయి బిళ్ళతో ఇలా చేశారంటే… ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది…!

 Authored By prabhas | The Telugu News | Updated on :5 November 2022,9:40 pm

Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా ధనాన్ని సంపాదించాలని కష్టపడుతూ ఉంటారు. అప్పుల బాధలు ఉండకూడదని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆర్థిక సమస్యల వలన ఎంత కష్టపడినా చేతిలో డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఎన్నో పూజ లు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్న ఇంట్లో భార్యాభర్తలు గొడవలు ఉన్న మనసు బాగా లేకపోయినా ఈ సమస్య నుంచి బయట పడాలన్న ఆదివారం రోజు ఈ ఒక్క పరిహారం చేసి చూడండి. ఆదివారం రోజు రూపాయి బిళ్ళతో పరిహారాన్ని కనుక చేసినట్లయితే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అమ్మవారికి రూపాయి బిళ్ళలు అంటే ఎంతో ప్రీతీ.

ఎందుకంటే ఆ రూపాయి బిళ్ళలలో కొన్ని గుప్పెడు తీసుకొని వాటిని శబ్దం చేయండి వాటిల్లో నుంచి ఒక మంగళకరమైన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కార్తీకమాసంలో ప్రతినిత్యం పూజలు చేస్తూనే ఉంటాము. ఇంట్లో దీపారాధన చేసి శివ కేశవులు ఇద్దరినీ కూడా ఆరాధిస్తూ ఉంటాము. ఉదయం, సాయంత్రం వేళలో దీపాలు పెట్టి ఆ శివకేశవులను ఇద్దరికీ కూడా మనం దీపాలు వెలిగించి మన సమస్యలు తీరిపోవాలని వేడుకొంటూ ఉంటాము. ఇలా పూజ చేసేటప్పుడు ఒక ఎర్రటి క్లాత్ ని తీసుకోవాలి. ఎర్రటి వస్తువులు అంటే లక్ష్మి దేవి కి ఎంతో ఇష్టం. ఒక ఎర్రటి క్లాత్ ని తీసుకొని రాగి ప్లేట్లో ఆ ఎర్రటి క్లాత్ ని వేయాలి. తర్వాత రూపాయి బిళ్ళను పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ రూపాయి బిళ్ళ మీద శ్రీ అని రాసి ఆ రూపాయి బిళ్ళని అలాగే ఎర్రటి గుడ్డలో పెట్టి ఆ గుడ్డతో సహా ముడి వేయాలి.

Lakshmi Devi on This was done with rupee bills on Sunday

Lakshmi Devi on This was done with rupee bills on Sunday

ముడివేసేటప్పుడు మీకున్న సమస్యలన్నీ కూడా చెప్పుకోని ఇవాళ నాకున్న అన్ని బాధలు పోవాలి అని సంకల్పం చెప్పుకొని మీ ఇంట్లో ఉన్న గదులు అలాగే వంటగది మొత్తం కూడా ఒకసారి తిరగాలి. తిరిగిన తర్వాత మీరు డబ్బు దాచుకునే ప్లేస్ లో పెట్టాలి. 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత తీసి ఆ ఎర్రిటి క్లాత్ ని ఏదన్నా పారే నీటిలో వేయాలి. ఆ రూపాయి బిళ్ళను కూడా మీరు ఏదైనా లక్ష్మీదేవికి సంబంధించిన అమ్మవారి గుడిలో హుండీలో వేసేయాలి. మీరు గనక ఇలా చేసినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీ ఇంటి నిండా ధనలక్ష్మి కురుస్తుంది లక్ష్మీదేవి ఇంటి మధ్యలో తీష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ పరిహారాన్ని ఆదివారం అందులోను కార్తీక త్రయోదశి చాలా ముఖ్యమైన రోజు. అందుకనే ఆదివారం రోజు ఈ ఒక్క రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని చేస్తే మీకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది