Lakshmi Devi : లక్ష్మీదేవి కలకాలం నిలిచి ఉండాలంటే… శుక్రవారం రోజున ఇలా పూజిస్తే చాలు…!
Lakshmi Devi : కొంతమంది ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలకడగా ఉండదు. వారికి తెలియకుండానే వచ్చిన డబ్బు అంతా ఖర్చయిపోతుంది. ఇలా జరగటానికి ఇంట్లో కొన్ని దోషాలు కూడా ఉంటాయి. అయితే ఇలాంటి దోషాలు పోవాలంటే లక్ష్మీదేవికి శుక్రవారం రోజు ఈ విధంగా పూజ చేస్తే అంతా మంచే జరుగుతుంది. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వారంలో ఏడు రోజులకు ఒక్కో గుర్తింపు ఉంటుంది. అయితే అన్ని వారాల కంటే శుక్రవారం మరింత ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. అందుకే ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది ఉపవాసం పాటిస్తారు.
మరికొందరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని కొలవాలి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ విధమైన పూజలు చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తారు. మహాలక్ష్మి దేవికి ఎనిమిది రూపాలు ఉంటాయి. ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్య లక్ష్మి, వరలక్ష్మి, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతాన లక్ష్మి, ఐశ్వర్య లక్ష్మి. శుక్రవారం రోజున అమ్మవారిని ఎనిమిది రూపాలను లక్ష్మీదేవి మంత్రాలను పటిస్తూ పూజించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి కుటుంబంలో సంతోషం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. సంతానం లేని వారికి కొద్దిరోజుల్లోనే శుభవార్తలను వింటారు.
హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని పూజించడానికి రాత్రివేళ పవిత్రమైనదిగా భావిస్తారు. కాబట్టి శుక్రవారం రోజున రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఈ పవిత్రమైన రోజున ఉతికిన బట్టలను ధరించి ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. అలాగే శ్రీ యంత్రాన్ని ఉంచాలి. ముందుగా నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అష్టగంధాన్ని శ్రీ యంత్రం లక్ష్మీదేవికి తిలకంగా పెట్టాలి. ఓం ఐం హ్రీం శ్రీ అష్ట లక్ష్మీయై హ్రీం సిద్థయే మామ్ గృహె అగ్చ్ఛగాచ నమః స్వాహా అనే మంత్రంతో పాటు అష్ట లక్ష్ములకు సంబంధించిన మంత్రాలను చదువుతూ ఇంట్లోనే ఎనిమిదిక్కుల్లో 8 దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.