Lakshmi Devi : లక్ష్మీదేవిని ఈ పువ్వుతో పూజిస్తే .. ఇంట్లో డబ్బే డబ్బు ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lakshmi Devi : లక్ష్మీదేవిని ఈ పువ్వుతో పూజిస్తే .. ఇంట్లో డబ్బే డబ్బు ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :23 November 2022,6:30 am

Lakshmi Devi ; లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే ఇష్టం. ప్రతి శుక్రవారం తామర పువ్వును లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచితే మంచి ఫలితాలు వస్తాయి. ఇలా అయిదు శుక్రవారాలు చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే సంతానం కోసం తామర పువ్వును ఏకాదశి రోజు శ్రీకృష్ణుడికి సమర్పించాలి. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. సంవత్సరంలో ప్రతి ఏకాదశి నాడు కృష్ణుడికి తామర పువ్వులు సమర్పిస్తే త్వరగా సంతానం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కుటుంబంలో కలహాలు ఉంటే బుధవారం నాడు తామర పువ్వుకు చందనం పూసి లక్ష్మీదేవి, గణేశుని పాదాల వద్ద ఉంచాలి.

11 బుధవారాలు ఇలా చేస్తే కుటుంబ కలహాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. అలాగే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించే స్థలంలో తామర పువ్వును ఉంచాలి. ఇలా చేస్తే సంపద పెరగడంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది. ఒక వారం పాటు తామర పువ్వును శివలింగంపై సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొబ్బరికాయపై తెల్ల కమలాన్ని ఉంచి లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా 11 శుక్రవారాలు పూజ చేసి 11వ శుక్రవారం నాడు చెరువులో లేదా నదిలో తామర పువ్వును వదలాలి.

Lakshmi Devi Pooja with Lotus get wealth

Lakshmi Devi Pooja with Lotus get wealth

కొబ్బరికాయను ఎర్రటీ గుడ్డలో చుట్టి బీరువాలో ఉంచాలి. ఇలా చేస్తే సంపద రెట్టింపు అవుతుంది. తామర పువ్వులో నెగెటివ్ ఎనర్జీని దూరం చేసే గుణం ఉంటుంది. లక్ష్మీదేవికి తామర పువ్వును సమర్పించడం వలన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవు. తామర పువ్వుకు అపారమైన శక్తి ఉంది. వృత్తి పరంగా జీవితంలో విజయం సాధించాలంటే లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజించాలి. తర్వాత ఈ పువ్వును ఎర్రటి గుడ్డలో ఉంచి బీరువాలో పెట్టాలి. దీపావళి రోజున తామర పువ్వును లక్ష్మీదేవికి సమర్పించాలి. అలా చేయలేక పోయినప్పుడు తామర పువ్వు పై కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోను పూజించాలి. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సంపద పెరుగుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది