Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నాలుగు రాశుల వారికి మహర్దశ.. ఇవి పాటిస్తే లక్ష్మీ కటాక్షం
Zodiac Signs : మనదేశంలో మెజార్టీ పీపుల్ ఆస్ట్రాలజీని నమ్ముతారు. కొన్ని కొన్ని సార్లు రాశులు, గ్రహాల ప్రభావం వల్ల కూడా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. ఏ పని చేయాలన్నా అన్ని చూసుకుని అంతా ఓకే అనుకుంటేనే చేస్తారు. ఇక శుభకార్యాలు చేసేటప్పుడు పురోహితుడిని సంప్రదించి అన్ని అనుకూలిస్తేనే ముందుకు వెళ్తారు. చాలామంది డైలీ రాశీ ఫలితాలను కూడా చదువుతుంటారు. నమ్ముతారు కూడా.. అయితే శనివారం నుంచి కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం పొందే అవకాశం ఉందని పండితులు చెబుతున్నా. అవి ఏ రాశులో ఇప్పుడు తెలుసుకుందాం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం ఒక నిర్ధిష్ట సమయంలో రాశిని మార్చుతుంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్లినప్పుడు ఆ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది.
కొందరికి మేలు జరిగితే.. మరికొందరికి చెడు జరుగుతుంది. కాగా జూన్ 18న శుక్ర గ్రహం రాశిచక్రాన్ని మార్చబోతోంది. మేషం నుంచి వృషభ రాశిలో సంచరిస్తుంది. జాతకంలో శుక్రుడు శుభంగా ఉన్నప్పుడు వారిపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది. శుక్రుడు రాశి మారిన వెంటనే కొన్ని రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి. అందులో మిథున రాశీ వారికి ఉద్యోగ, వ్యాపారాలకు అనుకూలమైన సమయం. ఈ రాశి వారికి సమాజంలో గౌరవం దక్కుతుంది. అన్ని పనులు విజయవంతమవుతాయి. వైవాహిక జీవితంలో భాగస్వామి నుంచి సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కర్కాటక రాశివారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. శుభ కార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారు ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు. ప్రేమ వ్యవహారాల్లో మార్పులు గమనిస్తారు. వృశ్చిక రాశి వారు విద్యారంగంతో అనుబంధం ఉన్న వారికి ఈ సమయం ఒక వరం లాంటిది. ఆర్థిక లావాదేవీలకు మంచి శుభ సమయం. ఈ రాశి వారికి వాహన కొనుగోలుకు అవకాశముంది. తల్లిదండ్రుల నుంచి సహకారం ఉంటుంది. అలాగే ధనుస్సు రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. సోదరీ, సోదరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఈ రాశి వారిలో ధైర్యం, శక్తి పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు లేదు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఫలితం ఉంటుంది.