Ugadi Festival 2021 : ఉగాది రోజు ఇలా చేస్తే లక్ష్మీ మీ ఇంట్లోనే ఉంటుంది !
ugadi festival 2021 : ఉగాది… కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభం. అయితే ఈ రోజు చాలా పవిత్రమైనది అంతేకాదు ఈరోజు మీరు చేసే పూజ, పనులతో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. దానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం…
ugadi festival 2021 : ఉగాదినాడు ఏం చేయాలి
ప్రాతఃకాలంలో లేచి అభ్యంగనస్నానం ఆచరించాలి. తర్వాత దేవుడి దగ్గర దీపారాధన చేసి అనంతరం వినాయకుడిని మొదట ఆరాధించాలి. తర్వాత శ్రీలక్ష్మీదేవిని, ఈశ్వరుడుని ఆరాధించాలి. దీనివల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి. తర్వాత పూజలు చేసి, ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ఉగాది పచ్చడిని ప్రసాదముగా తీసుకోవాలి.
ugadi festival 2021 : ఉగాది పచ్చడిలో ఏం వేయాలి ?
ప్రాంతీయంగా ఆయా ప్రాంతాలలో కొన్ని మార్పులతో ఈ పచ్చడిని చేసుకుంటారు. అయితే సాధారణంగా ఎక్కువమంది ఆచరించే పద్ధతి తెలుసుకుందాం.. వేప పూతను, లేత మామిడికాయ ముక్కలు, కొత్త చింత పండు, కొత్త బెల్లము, కొన్ని ప్రాంతాల వారు అశోక వృక్షము లేత చిగుళ్ళను, ఇంకా చెరకు ముక్కలు, జీలకర్రలతో, ఉప్పు, కొందరు కొంచెం కారం కూడా వేస్తుంటారు ఇలా ఆరు రకాల రుచులతో ప్రసాదమును తయారు చేస్తారు.

laxmi devi Pooja For ugadi festival 2021
పంచాగశ్రవణం “తిథిర్వారం చ నక్షత్రం యోగః కరణమేవ చ| పంచాంగస్య ఫలం శృణ్వన్ గంగా స్నాన ఫలం లభేత్||” ఉగాది పర్వ దినమునాడు పంచాంగ శ్రవణము ద్వారా సంవత్సర ఫలాలను, కాల మాన పరిస్థితులనూ, రాజకీయ రంగములోనూ, సంఘములోని తతిమ్మా రంగాలలలోనూ సంభవించే పరిణామాలను తెలుసుకొనుట ప్రజలలో ఆచారముగా పాటించబడుతూన్న ఔత్సాహిక విధి. ఉగాది పర్వ దినాన నూత్న సంవత్సరనామమునకు శ్రీకారం చుడతాము. ఈ రోజే కొత్త సంవత్సరము పేరును చెప్పడానికి నాంది పలుకుతాము. అనగా నిన్నటి దాకా చెప్పిన శ్రీ శార్వరీనామమునకు బదులుగా కొత్త సంవత్సరం శ్రీప్లవ నామమును పలుకుతూ, అర్చనా సాంప్రదాయాలను కొనసాగించాలి. ఇలా ఉగాది పంచాగశ్రవణం విన్న తర్వాత పెద్దలు అంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం, గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి. సత్యం, ధర్మంతో ఈ ఏడాది గడిపే శక్తిని ఇవ్వమని ఆ దేవుడిని ఆరాధించి గతంలో చేసిన పొరపాట్లను ఈ ఏడాది చేయకుండా సన్మార్గంలో, జ్ఞానసముపార్జన చేస్తూ జీవితాన్ని సార్థకత చేసుకోవాలి.