LaxmiDevi : మీ ఇంట్లో ధనలక్ష్మి తిష్ట వేసుకుని కూర్చోవాలంటే.. ఇలా చేయండి..

Authored By mallesh | The Telugu News | Updated on: January 18, 2022, 6:42 pm

LaxmiDevi: డబ్బు అంటే ప్రతి ఒక్కరికీ అవసరమే.. దీని కోసం మనుషులు చేయని పని లేదు. మొక్కని దేవుడు లేదు. ప్రపంచమంతా నడిచేది మనీపైనే. మానవీయ సంబంధాలు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. అందుకే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే చుట్టాలు మన చుట్టూ చేరతారు. డబ్బు లేని వారిని ఎవరూ పట్టించుకోరు. కానీ కొంత మంది డబ్బు వద్ద ఉంటుంది. మరి కొంత మంది వద్ద ఉండదు. కొందరు ఎంత సంపాదించిన ఏదో రూపంలో ఖర్చు చేస్తూనే ఉంటారు. ఎంతో కొంత సేవ్ చేద్దామనుకున్నా.. వారికి తెలియకుండానే ఖర్చు చేస్తూ ఉంటారు.

శుక్రవారం, మంగళవారం మినహా మిగతా రోజుల్లో ఏ రోజునైనా ఇంట్లోకి చిన్న మట్టి కుండను తెచ్చుకోండి. కొత్త మట్టికుండను ఇంట్లోకి తీసుకొచ్చే ముందు దానిపై ఒక ఎక్స్ (ఇన్ టూ) మార్క్ వేసుకోవాలి. అనంతరం దానికి శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి. తర్వాత శుక్రవారం లేదా మంగళవారం రోజున సగం వరకు కల్ల (రాతి) ఉప్పు వేయాలి. తర్వాత దానిపై ఓ పేపర్ ను ఉంచాలి. తర్వాత మీ జీతంలోని కొంత డబ్బును ఆ కుండలో ఉంచిన పేపర్ పై పెట్టండి. ఇక ఆ కుండను దేవుడి వద్ద కానీ, లేదంటే బీరువాలో కానీ ఉంచాలి.

LaxmiDevi ways to store money at home

LaxmiDevi ways to store money at home

LaxmiDevi : మట్టికుంట, ఉప్పుతో ఇలా చేయండి

డబ్బు చాలా మంది చేతులు మారి వస్తుంది కాబట్టి ఇలా ఒక రోజంతా డబ్బు ఆ కుండలో ఉండాలి. ఇలా ఉండటం వల్ల ఆ డబ్బులో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుంది. తర్వాత ఆ డబ్బును కుండలోంచి తీసేసి బీరువాలో పెట్టాలి. అవసరాలకు సైతం ఆ డబ్బును వాడుకోవచ్చు. ఇలా మూడు నెలల పాటు చేయడం వల్ల ఇంట్లో డబ్బు నిల్వ ఉంటుంది. ఇలా కాకుండా.. గాజు బౌల్‌లో కొద్దిగా నీరు తీసుకుని అందులో రాతి ఉప్పు వేసి ఇంట్లో ఎవరూ తిరగని చోట దానిని ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ఇలా ఐదురోజులకు ఒక సారి చేయాలి.

mallesh

No bio available for this author.

  1. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  2. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  3. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  4. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  5. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  6. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  7. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp