Maha Shivaratri : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలకి పోటెత్తిన భక్తులు
ప్రధానాంశాలు:
Maha Shivaratri : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలకి పోటెత్తిన భక్తులు
Maha Shivaratri : నేడు మహా శివరాత్రి Maha Shivaratriపర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. కిటకిటలాడుతున్నాయి. అర్ధరాత్రి నుంచే ఆలయాల Temples ముందు బారులు తీరి నిల్చున్నారు భక్తులు. తెల్లవారు జామునాటి మొదటి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరమశివుడిని దర్శించుకుంటోన్నారు.

Maha Shivaratri : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలకి పోటెత్తిన భక్తులు
Maha Shivaratri శివాలయాల్లో సందడి..
బుధవారం వేకువ జాము నుంచే శ్రీశైలం Srisailamలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉభయ దేవాలయాల్లో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. పాతాళగంగలో భక్తులు పున్య స్నానాలు ఆచరించి.. క్యూ లైన్లలో నిలుచుని ఆది దంపతులను దర్శించుకుంటున్నారు.
రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం శోభాయమానంగా కనువిందు చేస్తుంది. ప్రతి సంవత్సరం రాజన్న గుడిలో మూడు రోజులపాటు మహాశివరాత్రి Maha Shivratri జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మిగతా శివాలయాలు కూడా భక్తులతో కళకళలాడుతున్నాయి.