Maha Shivaratri Special Shivlinga : నిజంగా చాలా గ్రేట్.. చాక్‌పీస్‌లతో 109 శివలింగాలు తయారు చేసిన రజనీకాంత్
ప్రధానాంశాలు:
Maha Shivaratri Special Shivlinga : నిజంగా చాలా గ్రేట్.. చాక్‌పీస్‌లతో 109 శివలింగాలు తయారు చేసిన రజనీకాంత్
Maha Shivaratri Special Shivlinga : మహాశివరాత్రి పండుగని దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటారు. శివరాత్రి Shivratri రోజు మహాశివుడి కొలిచేందుకు విభిన్న రూపాల్లో శివలింగాలు తయారు చేస్తుంటారు. విభిన్న రూపాల్లోని శివలింగానికి పూజ చేస్తూ రాత్రంతా జాగారం చేస్తుంటారు. గత కొంతకాలంగా విభిన్న రూపాల్లో శివలింగాలను తయారు చేస్తుండగా,మహాశివరాత్రి సమీపిస్తున్న తరుణంలో తన కళాకృతులతో ఆకట్టుకున్నాడు ఓ యువకుడు .

Maha Shivaratri Special Shivlinga : నిజంగా చాలా గ్రేట్.. చాక్‌పీస్‌లతో 109 శివలింగాలు తయారు చేసిన రజనీకాంత్
Maha Shivaratri Special Shivlinga వినూత్న శివలింగం..
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ఆడెపు రజినీకాంత్ Rajinikanthఅనే సూక్ష్మ కళాకారుడు.. సుమారు 10 గంటలపాట శ్రమించి 109 శివలింగాలను తయారుచేసాడు.ఇవి పరతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గతంలో కాయిన్స్ తో శివలింగాన్ని తయారు చేశాడు ఓ కళాకారుడు. ఇందుకోసం ఐదు రూపాయల కాయిన్స్ ఉపయోగించాడు. దాదాపు ఐదు వేల ఐదు రూపాయల కాయిన్స్ తో శివలింగాన్ని తయారు చేశాడు.
ఏది ఏమైన శివరాత్రి పండుగ Festival రోజు చాక్ పీస్‌తో రెడీ చేసిన ఈ శివలింగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నయి.గతంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 1008 కేజీల లడ్డూతో తయారు చేసిన శివలింగం విశేషంగా ఆకట్టుకుంది. షాపు నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించి లడ్డూతో ఆరు అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో శివలింగాకారాన్ని రూపుదిద్దారు. కైలాసగిరిలో ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసారు.
అద్భుతం… చాక్‌పీస్‌లతో 109 శివలింగాలు
మహాశివరాత్రి సమీపిస్తున్న తరుణంలో తన కళాకృతులతో ఆకట్టుకుంటున్న యువకుడు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ఆడెపు రజినీకాంత్ అనే సూక్ష్మ కళాకారుడు
సుమారు 10 గంటలపాట శ్రమించి 109 శివలింగాలను తయారుచేసినట్లు తెలిపిన… pic.twitter.com/ZmllxMyuEC
— BIG TV Breaking News (@bigtvtelugu) February 25, 2025