Meena Rasi : ఏప్రిల్ నెలలో మీరు నమ్మిన నమ్మకపోయినా మీన రాశి వారికి జరిగే నాలుగు ముఖ్య సంఘటనలు ఇవే…!!
Meena Rasi : మీన రాశి రాశి చక్రంలో 12వ రాశి. ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశి అవుతుంది. ఏప్రిల్ లో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది. ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పొదుపు పాటిస్తారు. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బంది పెట్టాలని చూస్తారు.ఉద్యోగ […]
Meena Rasi : మీన రాశి రాశి చక్రంలో 12వ రాశి. ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశి అవుతుంది. ఏప్రిల్ లో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది. ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పొదుపు పాటిస్తారు. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బంది పెట్టాలని చూస్తారు.ఉద్యోగ పరంగా బాధ్యతలు పెరిగి శారీరక శ్రమకు గురవుతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొందరు బంధువులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కలిసొస్తాయి. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. అమ్మకాలు కొనుగోలు వల్ల లాభపడతారు. విశేషంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణిస్తారు. సంతాన పురోభివృద్ధికి కొంత సమయాన్ని కేటాయిస్తారు. సోదర సోదరీ వర్గం ప్రేమ వివాహాలు చికాకు కలిగిస్తాయి. ఇలాంటి వ్యవహారాలకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకుంటారు. ఓ విధంగా మీరు బాధ్యతలు నుంచి తప్పుకుంటారు. స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి.
కుటుంబంలో ఐకమత్యం నెలకొంటుంది. ఇందువల్ల మీరు బయట కార్యక్రమాలను సులువుగా ఉత్సాహంగా చేయగలుగుతారు. స్నేహితులతో కలిసి మీరు పార్ట్ టైం వ్యాపారం చేస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు పెద్దగా ఆకర్షించవు. ఏదో ఒక లోపం ఉన్నట్లుగా తోస్తుంది. దీక్ష కార్యక్రమాలు స్వయంగా నియమనిష్ఠలతో నిర్వహిస్తారు. ఉద్యోగుల ప్రమోషన్ లభిస్తుంది. మీ ప్రాధాన్యత తగ్గించడానికి కొంతమంది ప్రయత్నాలు చేసినా అవి తాత్కాలికమే శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మళ్లీ మీరు అనుకున్న స్థానానికి రాగలుగుతారు. వాస్తవాలకు అతీతంగా ఊహాలోకంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఈ పప్పు ఏకపక్ష నిర్ణయాలు కలిసి రావు. నలుగురితో కలిసి చర్చించి నిపుణుల సలహాలు తీసుకొని మీ ఆలోచనలను అమలు చేయండి. ఉద్యోగ పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలను క్రింది స్థాయి ఉద్యోగులు వ్యతిరేకిస్తారు. చెప్పుడు మాటలు మోస్తారు. రాజకీయాల్లో రాణిస్తారు. తాత్కాలిక వేతనాలు మీద ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. యూనియన్లకు సంఘాలకు సంబంధించిన విషయాలకు మీ నాయకత్వంలో సలహాలు సాధిస్తాయి. వివాహాది శుభకార్యాలు మూడు పడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. సంతృప్తి కలుగుతుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మార్పులు వస్తాయి. క్రీడారంగంలోని వారికి ప్రోత్సాహకాలు అవార్డులు లభిస్తాయి. నూతన పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారం బాగుంటుంది.
శని రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు tv రంగాల్లోని వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. దేవాలయాలలో అవినీతి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎలాంటి శిక్ష పడుతుందోనని రకరకాలుగా ఆలోచిస్తారు.దేవుడు సొమ్ము తినడానికి వాళ్లకి చేతులు ఎలా వస్తున్నాయో అర్థం కాక అయోమయంలో పడతారు. కార్యాలయంలో గ్రూపు తగాదాలు పరాకాష్టకు చేరుకుంటాయి. జల సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. మీరు కొనుగోలు చేసిన ఆస్తులు విలువ పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. దేనికి తొందరపడవద్దు. కొంతమంది ఇబ్బంది పెట్టాలని చూసే వారు ఉంటారు. ఎవరిని పట్టించుకోకుండా మీరు పని మీరు చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. ఆర్థిక విషయాల్లో పర్వాలేదనిపిస్తుంది. వ్యయం పెరగకుండా జాగ్రత్తపడాలి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అభివృద్ధిని ఇచ్చే అంశాలు స్పష్టత అవసరం. నవగ్రహ ఆరాధన మేలు చేస్తుంది.బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం.