Nithyananda Kailasa : స్వామి నిత్యానంద “కైలాస” దేశం ఎంత పెట్టి కొన్నాడో తెలుసా..? డబ్బులు ఎవరిచ్చారో తెలుసా..?
Nithyananda Kailasa : స్వామి నిత్యానంద గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతీయ హిందూ గురువు. దేశ విదేశాలలో ఆశ్రమాలు మరియు గురుకులాలు దేవాలయాలను కలిగి ఉన్న ట్రస్ట్ నిత్యానంద జ్ఞానపీఠం వ్యవస్థాపకుడు. స్వామి నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. ఆయనను అనుసరించి అనుచరులు నిత్యానంద పరమశివం, పరమహంస నిత్యానందాన్ని కూడా పిలుస్తారు. ఈయన తమిళనాడులోని తిరువన్నమలైలో అరుణాచలం, లోక నాయకి కీ జన్మించడం జరిగింది. ఆధ్యాత్మిక గురువు అయినా గాని నిత్యానందకై భారతీయ న్యాయస్థానాలలో అత్యాచారం, అపహరణ ఆరోపణలు విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన చాలాసార్లు కోర్టుకు కూడా హాజరు కావడం జరిగింది.అయితే అనంతరం ఆయన 2019లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
తర్వాత ఈక్వేడర్ సమీపంలో “కైలాస” అనే తన సొంత ద్వీపదేశాన్ని స్థాపించటం దానికి ఆయనే ప్రధాని అని తనకి తాను ప్రకటించుకున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఐక్యరాజ్యసమితిలో “కైలాస” దేశ ప్రతినిధిగా విజయ ప్రియ నిత్యానందా అనే అమ్మాయి హాజరు కావడం జరిగింది. రావటం మాత్రమే కాదు ఐక్యరాజ్యసమితిలో భారతదేశంపై.. ఈ నిత్యానంద శిష్యురాలు అనేకమైన ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో భారతదేశం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఐక్యరాజ్యసమితి… అసలు “కైలాస” దేశమే లేదు వేరువేరు సంఘాల ప్రతినిధులతో UNలో మాట్లాడే అవకాశం ఇస్తారు. ఆ సమయంలో ఆమె భారతదేశంపై వ్యాఖ్యలు చేసినట్లు… వాళ్ళు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోమని ఐక్యరాజ్యసమితి భారత్ కి క్లారిటీ ఇవ్వటం జరిగింది. అయితే ఐక్యరాజ్యసమితికి వెళ్లిన అమ్మాయిని కైలాస దేశ శాశ్వత రాయబారి అని నిత్యానంద సోషల్ మీడియాలో
పోస్ట్ చేయడం మరింత వైరల్ అయింది. దీంతో ఇండియా కి చెందిన ఓ జాతీయ ఛానల్ కైలాస దేశం ఎక్కడ ఉంది అన్నదానిపై సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. “కైలాస” అనేది ఈక్వేడర్ లోనీ చిన్న ద్వీపం. దీనిని ఈక్వేడర్ నుండి భారీ ధరకు నిత్యానంద కొనుగోలు చేయడం జరిగిందంట. అయితే అంత డబ్బు నిత్యానందకి… కెనడాలోని ఆది శైవ మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు విరాళాలు ఇవ్వటం జరిగిందనీ టాక్. అయితే ఇది చాలా చిన్న దివి వైశాల్యం కూడా తక్కువే అని NDTV తెలియజేయడం జరిగింది. మరోపక్క నిత్యానంద “కైలాస” దేశానికి పాస్ పోర్ట్, ప్రత్యేక జండాతో పాటు రాజ్యాంగం రూపొందించే పనిలో నిమగ్నమయ్యారట. తమ దేశ పౌరసత్వానికి అప్లై చేసుకునే వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతున్నట్లు ఇటీవల ప్రకటన చేశారు.