Numerology : మీరు ఈ తారీకులలో జన్మించారా… అయితే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :27 February 2025,8:00 am
  •  Numerology : మీరు ఈ తారీకులలో జన్మించారా... అయితే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా...?

Numerology  : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాన్ని బట్టి జాతకాలని అంచనా వేస్తారు. అలాగే సంఖ్యా శాస్త్రం కూడా వ్యక్తి జన్మించిన తేదీ ద్వారా అతని స్వభావం మరియు లక్షణాలు, ప్రవర్తన ఇంకా భవిష్యత్తు గురించి అంచనా వేస్తారు. మరి ప్రతి ఒక సంఖ్యకు కూడా ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అదృష్టాన్ని అంచనా వేయటానికి ముందుగా మూలకం ( అంక సంఖ్య) లెక్కించాలి. ఇది ఒకటి నుంచి తొమ్మిది మధ్యలో ఏదైనా అంకంగా నిర్ణయించబడుతుంది. ప్రత్యేకంగా ఏడు మూలాంకo కలిగిన వ్యక్తులు లోతైన ఆలోచన చేసేవారు, స్వీయ పరిశీలన చేసే గుణం కలిగి ఉంటారు.

Numerology : మీరు ఈ తారీకులలో  జన్మించారా... అయితే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా...?

Numerology : మీరు ఈ తారీకులలో జన్మించారా… అయితే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా…?

Numerology  : సంఖ్యాశాస్త్రం ఏం చెబుతుంది

సంఖ్యాశాస్త్రం ప్రకారం 7,16,25 తేదీలలో జన్మించిన వారికి మూలాంకం 7 గా నిర్ణయించబడుతుంది. ఈ అంకానికి గ్రహాధిపతి కేతువు. కేతువు ప్రభావంతో వీరు లోతైన ఆలోచన చేసే వ్యక్తులుగా ఉంటారు. ఏదైనా విషయాన్ని పూర్తిగా మీరు విశ్లేషించని ఆ తర్వాతనే నమ్మే స్వభావం కలిగి ఉంటారు. ఈ మూలాంకం కలిగిన వ్యక్తులు ఎక్కువగా అంతర్ముఖంగాను ఉంటారు. తమ భావాలను ఇతరులతో పంచుకోవడానికి అంతగా ఇష్టపడరు. మౌనంగా ఉండడం వల్ల ఇతరులకు వీరిని అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇతరులపై వీరు చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. ఏదైనా విషయం లోతుగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఈ అంకంలో జన్మించిన వారు సహజంగా అనుమాన స్వభావం కలిగి ఉంటారు. ఏ పని జరిగినా కూడా అది నిజమా అని ప్రశ్న వేస్తారు. వెంటనే అంతా సులువుగా నమ్మరు. ఈ విషయం కూడా క్షుణ్ణంగా విశ్లేషించి నిజం తెలుసుకునే వరకు ఎదురుచూసి నిర్ణయం తీసుకుంటారు. ఈ అలవాటు వీరికి చిన్ననాటి నుంచి అలవాటుగా వస్తూ ఉంటుంది. వీరి ఊహ శక్తి చాలా మెరుగైన స్థానంలో ఉంటుంది.

ఏడు మూల అంకం కలిగిన వారు చాలా తెలివైన వారు. నిర్ణయాలు బలంగా, స్పష్టంగా కూడా ఉంటాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నత ఉద్యోగాలకు చేరే అవకాశం ఎక్కువ. న్యాయవ్యవస్థలో కూడా వీరు ప్రాముఖ్యత పొందే అవకాశం ఉంది. మీరు విషయాలను చాలా లోతుగా అర్థం చేసుకుంటారు. తక్క బంధంగా లేసించే శక్తి వీరికి సహజంగానే ఉంటుంది. కాబట్టి వీరు న్యాయమూర్తులుగా ఎదిగే అవకాశాలు వీరికి చాలానే ఉన్నాయి.
ఈ అంకం వీరు మంచి తీర్పులు నిచ్చే వ్యక్తిగా కలిగి ఉంటారు. హడావిడి చేసే మనుషులు కారు. మీరు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కేతు ప్రభావం చేత వీరికి మత సంబంధమైన విషయాలు ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి వీరికి శాస్త్రీయంగా ఆలోచించేలా చేస్తుంది.

Advertisement

ramu

Author Bio Info : Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి