Maha shivratri : మహాశివరాత్రి రోజున ఉపవాసం చేసేవారికి… ఏ ఆహారాలు తినాలి…? ఏవి తినకూడనివి… తెలుసుకోండి…?
ప్రధానాంశాలు:
Maha shivratri : మహాశివరాత్రి రోజున ఉపవాసం చేసేవారికి... ఏ ఆహారాలు తినాలి...? ఏవి తినకూడనివి... తెలుసుకోండి...?
Maha shivratri : మహాశివరాత్రి 25 ఫిబ్రవరి 26వ తేదీన శివాలయాలలో శివనామ స్మరణతో భక్తులతో కిటకిటలాడుతుంది. రోజున భక్తులందరూ కూడా భక్తిశ్రద్ధలతో ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఆ శివయ్యను భక్తిశ్రద్ధలతో కోరికలను కోరుకుంటారు. మరి ఆ రోజు ఉపవాసం చేసేవారు ఏ ఆహారాలు తింటే మంచిది, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ ఆహారాలు తినకూడదు తెలుసుకుందాం…

Maha shivratri : మహాశివరాత్రి రోజున ఉపవాసం చేసేవారికి… ఏ ఆహారాలు తినాలి…? ఏవి తినకూడనివి… తెలుసుకోండి…?
మహాశివరాత్రికి ఉపవాసం ఉండేవారు త్రయోదశి రోజున ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలంట. అలాగే రాత్రంతా పూజ ప్రారంభించే ముందు స్నానం చేయాలంట. శివరాత్రి రోజున భక్తులు పూజను రాత్రిపూట ఒక్కసారి లేదా నాలుగు సార్లు చేయవచ్చు. శివరాత్రి రోజున ఉపవాసం చేసేవారు ఉదయాన్నే లేచి, స్థానాలను ఆచరించి, కొత్త బట్టలను ధరించాలి. వీరు ఉపవాసాలు చేసేటప్పుడు, నీరు, పాలు, తేనె, గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేయాలి. శివలింగంపై కొబ్బరి నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చల్లకూడదు. గుడికి సమర్పించినవి ఏవి కూడా మీరు తినకూడదంట.. అలాగే, టీ, కాఫీలు కూడా తాగకూడదంట.
ఆసం ఉన్న భక్తులు పండ్లు, పాలు, అరటి పండ్లు, చిరుధాన్యాలు, బంగాళదుంప,డ్రై ఫ్రూట్స్, వంటివి తినాలి అంటున్నారు పండితులు.
గోధుమ రొట్టె, బియ్యం వంటి ధాన్యాలు, పప్పు, చిక్కుళ్ళు, ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారాలు, వంటివి ఉపవాసం చేసేవారు అస్సలే తినకూడదు. స్నానం చేసిన తర్వాతనే ఉపవాస దీక్షను విరమించాలంట.