Numerology | ఏ తేదీలో పుట్టిన వారు చదువులో రాణిస్తారు?.. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆసక్తికర విశ్లేషణ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Numerology | ఏ తేదీలో పుట్టిన వారు చదువులో రాణిస్తారు?.. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆసక్తికర విశ్లేషణ

 Authored By sandeep | The Telugu News | Updated on :22 September 2025,6:00 am

Numerology | రాశిచక్రాల ప్రకారం మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సాహం చాలామందిలో ఉంటుంది. అయితే, మరోవైపు సంఖ్యాశాస్త్రం కూడా అంతే ప్రాచుర్యం పొందుతోంది. పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తి స్వభావం, విద్య, కెరీర్ వంటి అనేక విషయాలపై అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

#image_title

ఎవ‌రెవ‌రికి ఎలా ఉంటుంది

ఈ క్రమంలో, పుట్టిన తేదీ బట్టి ఎవరు చదువులో రాణిస్తారు? అన్న విషయంపై సంఖ్యాశాస్త్రం ఆసక్తికరంగా చెప్పుతోంది. 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారి జన్మ సంఖ్య 1. వీరికి అధిక ఆత్మవిశ్వాసం, నేతృత్వ లక్షణాలు ఉంటాయి. విజేతలుగా ఎదిగే గుణాలు వీరిలో ఉండటం వల్ల విద్యా రంగంలోనూ, ఉద్యోగాల్లోనూ ఉన్నత స్థానాలను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణుల అభిప్రాయం.

3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు జ్ఞాపకశక్తితో పాటు బహుముఖ ప్రతిభ కలవారు. వీరికి విద్యతో పాటు కళారంగాల్లోనూ మంచి పేరు వస్తుందని చెబుతున్నారు. టీవీ, సినిమా రంగాల్లో ఎక్కువ మంది జన్మ సంఖ్య 3వారే కనిపిస్తారు.7, 16, 25, 20 తేదీల్లో పుట్టినవారు లోతైన ఆలోచన చేసే ధోరణి కలవారు. వీరికి చదువుపై ఆసక్తి అధికంగా ఉంటుంది.5, 14, 23 తేదీల్లో పుట్టినవారు చాలా చురుకుగా ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో వీరు ముందుంటారు. చదువులోనూ, కెరీర్‌లోనూ తమ తెలివితేటలతో ముందుకు సాగుతారు. త్వరితగతిన ఆలోచించే వీరికి ఆర్ధిక, మానవ సంబంధాలు బలంగా ఉంటాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది