Chanakya Niti : ఈ మూడు రకాల వ్యక్తులను ఎంత దురం పెడితే అంత మంచిది.. లేదంటే మీ జీవితం నాశనం అవడం ఖాయం
Chanakya Niti : ఈ ప్రపంచం మొత్తం రకరకాల మనుషులతో నిండిపోయి ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కో స్వభావం. ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవ్వరికీ తెలియదు. అందుకే.. ప్రతి విషయంలో చాణక్య నీతి అవసరం అంటారు. ఎందుకంటే.. చాణిక్యుడు అనే వ్యక్తి గొప్ప పండితుడు. భారత్ లో ఉన్న గొప్ప పండితుల్లో ఆయన ఒకరు. ఆయన తన జీవితంలో తెలుసుకున్న సత్యాలను, అనుభవాన్ని పుస్తకంగా రాశారు. అదే చాణక్య నీతి.ఆ పుస్తకం చదివితే.. చాలా విషయాలు తెలుస్తాయి. ఎవరితో ఎలా ఉండాలో తెలుస్తుంది.
కొన్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంది ఆ పుస్తకం. లేదంటే జీవితమే నాశనం అవుతుంది అని చాణక్యుడు పుస్తకంలో రాశాడు.చాణక్య నీతిలో మూడు రకాల వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండాలని చెబుతుంది. వాళ్లు కోపంతో ఉన్నవాళ్లు, స్వార్థపరులు, పొగిడే వారు. ఈ ముగ్గురు జీవితంలో చాలా ప్రమాదకరం అని చాణక్యుడు తన నీతి పుస్తకంలో రాశారు.స్వార్థపరులు ఎప్పుడూ తమ గురించే ఆలోచిస్తారు. పక్కవాడు ఏమైపోయినా పట్టించుకోరు.
Chanakya Niti : స్వార్థపరులను దూరం పెట్టకపోతే.. కొంప కొల్లేరే
తన లాభం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తన ప్రయోజనాల కోసం బతుకుతుంటాడు. అటువంటి వారిని జన్మలో కూడా పట్టించుకోవద్దంటారు చాణక్యుడు. అలాగే కోపంతో ఉన్న వ్యక్తి.. తన దగ్గర పదునైన ఆయుధాలను కలిగి ఉన్న వ్యక్తిగా చెబుతుంటారు. అందుకే.. వాళ్లను కూడా జీవితంలో దూరం పెట్టాలని చాణక్య నీతి చెబుతోంది.మీ ముందు పొగిడి.. మీ వెనుక తిట్టే వాళ్లను జన్మలో కూడా దగ్గరికి రానివ్వకూడదట. ముఖం మీద పొగిడే వారు.. వెనుక ఖచ్చితంగా చెడు చేస్తారని.. అటువంటి వాళ్లను తమ శ్రేయోభిలాషులుగా అనుకుంటే జీవితం నాశనం అవుతుందని చాణక్య నీతి చెబుతోంది.