Own House : జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన విధంగా చేస్తే… సొంత ఇంటి కల నెరవేరాల్సిందే…ఆ రెమెడీస్ ఏమిటో తెలుసుకుందాం…?
ప్రధానాంశాలు:
Own House : జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన విధంగా చేస్తే... సొంత ఇంటి కల నెరవేరాల్సిందే...ఆ రెమెడీస్ ఏమిటో తెలుసుకుందాం...?
Own House : ఇంత ఇల్లు లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అనుభవించే వారికే తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. జీవితంలో సొంత ఇల్లు నిర్మించుకుంటే చాలు అనుకుంటారు. నగరాలలో అద్దె ఇళ్లల్లో ఉంటూ ఎంతోమంది ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇళ్లల్లో ఉండే వారు కూడా తమ లక్ష్యం సొంత ఇల్లు ఎలాగైనా నిర్మించుకోవాలని బలంగా కోరుకుంటారు. కానీ కొందరు తమ ఆర్థిక పరిస్థితుల వల్ల కోరిక నిరాశ అయిపోతుంది. కొనాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా ప్రయాస అవుతుంది. ఇలాంటి సమస్యలకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని సులువమైన ఆచారాలు పరిహారాలు అనుసరించడం ద్వారా సొంత ఇంటిని త్వరగా సొంతం చేసుకోవచ్చు అని జ్యోతిష్య నిపుణులు ఈ అవకాశాల గురించి తెలియజేస్తున్నారు సొంతగృహకల్ నెరవేరాలంటే ఈ రెమెడీస్ ను తప్పక ఫాలో అవ్వండి. సొంత ఇంటి గృహం ఎవరైతే కావాలనుకుంటున్నారో, ఈ పరిహారం చేయడం ద్వారా తప్పక గృహ యోగాన్ని పొందుతారు. గురువారం రోజున శ్రీమహావిష్ణువుని తప్పక పూజించండి. గురు శాస్త్రంలో గురుగ్రహం సంపద, శ్రేయస్సు స్థిరాస్తులతో ముడిపడి ఉంటుంది. వారం ఉదయం స్నానం చేసి, సుచిగా ఉన్న ప్రదేశంలో శ్రీ విష్ణు విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచి. రంగు పూలతో అలంకరణ చేయాలి. ఆ తరువాత” ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ పూజ గురు గ్రహ దోషాలను తొలగించి, తికస్థిరత్వాన్ని మెరుగుపరుచుటకు ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది.

Own House : జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన విధంగా చేస్తే… సొంత ఇంటి కల నెరవేరాల్సిందే…ఆ రెమెడీస్ ఏమిటో తెలుసుకుందాం…?
Own House ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం
మరో ముఖ్యమైన ఉపాయం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని తప్పనిసరిగా పూజించాలి. శుక్ర గ్రహం ఐశ్వర్యం సౌకర్యాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇంటి కొనుగోలుకు సహాయపడుతుంది. గురువారం సాయంత్రం లక్ష్మీదేవి చిత్రాన్ని శుభ్రమైన స్థలంలో ఉంచి, తామర పుష్పాలు లేదా గులాబీలతో సమర్పించండి. శ్రీ లక్ష్మీ అష్టకం, పటించి కీర్ లేదా కేసరి నైవేద్యాన్ని అర్పించండి. ఆచారం ఆర్థిక అడ్డంకులను తొలగించి ఇంటి కలను నెరవేర్చే ప్రయత్నంలో సహాయపడుతుంది.
భూవివాదాలను తొలగించుకోండిలా : భూమి సంబంధించిన అడ్డంకులను తొలగించడానికి భూదేవిని పూజించడం మరో శక్తివంతమైన పరిహారం. శనివారం లేదా మంగళవారం రోజు ఒక చిన్న మట్టి కుండలో గోధుమలు, బెల్లం, పసుపు ఉంచి దానిని ఇంటి ఈశాన్య దిశలో భూమిలో పాతి పెట్టండి. ఈ సమయంలో ” ఓం భూమి దేవ్యై నమః ” ఏ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించండి. పరిహారం భూమి సంబంధిత గ్రహదోషాలను తొలగించి, ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణ ప్రక్రియను సులభతరం చేస్తుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
వాస్తు కీలకం : వాస్తు శాస్త్రాన్ని పాటించడం కూడా సొంత ఇల్లు సాధించడంలో కీలకపాత్రను పోషిస్తుంది. ఇంటి కొనుగోలు సమయంలో ఈశాన్య దిశ శుభ్రంగా అడ్డంకులు లేకుండా ఉండేలా చూసుకోండి. ఈ ప్రధాన ద్వారం ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండడం వాస్తు పరంగా శుభప్రదంగా భావిస్తారు. ఇంటిని కొనుగోలు చేసుకునే ఒప్పందాలు ముందు జ్యోతిష్య నిపుణులు సలహా తీసుకొని చేస్తే గృహస్థితులు అనుకూలంగా మార్చుకోవచ్చు. జ్యోతిష్య పరిహారాలన్నిటిని నిష్టగా విశ్వాసంతో అనుసరించడం ద్వారా సొంత ఇల్లు సాధించడంలో వచ్చే అడ్డంకులన్నీ అధిగమించవచ్చని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. అయితే, రూపాయలతో పాటు ఆర్థిక ప్రణాళిక కఠిన పరిశ్రమ కూడా అవసరం. శ్రీ విష్ణువు,లక్ష్మీదేవి, ఇంకా భూదేవి ఆశీస్సులతో మీ సొంత ఇంటి కలను త్వరలోనే నెరవేర్చుకోవచ్చు.