Chanakya Niti : ఈ అలవాట్లు ఉంటే చాలు.. జీవితంలో గెలవలేరు.. ఎప్పుడూ వాళ్లను ఓటమే పలకరిస్తుంది
Chanakya Niti : చాణక్య నీతి అనే పుస్తకాన్ని రాసి చాణక్యుడు మానవ జాతికి ఎంతో మేలు చేశారు. ఎందుకంటే.. మనిషి తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాడు. ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో.. వాటిని ఎలా జయించాలో చాణక్యుడు తన పుస్తకంలో ముందే చెప్పారు.ఆయన రచించిన నీతి శాస్త్రంలో చాలా అంశాలను చాణక్యుడు ప్రస్తావించారు. మనిషి తన జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఆ సమయంలో మనిషి ఏం చేయాలి.. ఎలా ఆ సమస్యలను ఎదుర్కోవాలో నేటి జనరేషన్ కు చెప్పారు. అదంతా ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల ద్వారా గుర్తించినవే.
చాలామంది ఒకసారి విజయం సాధించగానే చాలా అహంభావానికి లోనవుతుంటారు. జీవితంలో ఓడిపోని వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరు. అందరూ ఏదో ఒక సమయంలో ఓడిపోతారు. కొందరైతే జీవితాంతం ఓడిపోతూనే ఉంటారు. దానికి కారణాలలో ఒకటి అహంభావం. ఒకసారి గెలపు తలుపు తట్టగానే కొందరికి అహంభావం పెరుగుతుంది. అది చాలా డేంజర్. అటువంటి వాళ్లు ఖచ్చితంగా మళ్లీ ఓటమిని చవి చూడాల్సిందే అని తన నీతి శాస్త్రంలో చాణక్యుడు చెప్పుకొచ్చారు.కొందరికి నెగెటివ్ ఆలోచనలు విపరీతంగా వస్తుంటాయి. అటువంటి వాళ్లు జీవితంలో గెలవలేరు. ఎప్పుడు ఓడిపోతూనే ఉంటారు. నెగెటివ్ ఆలోచనలతో ఉన్నవాళ్లు ఆర్థికంగా కూడా వెనక బడిపోతారు. శారీరకంగా కూడా వాళ్లకు సమస్యలు వస్తాయి.
Chanakya Niti : అహంభావం ఉంటే ఇక అంతే
కొందరు టైమ్ ను అస్సలు పట్టించుకోరు. సమయం కంటే కూడా డబ్బుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. అటువంటి వాళ్లను ఎప్పుడూ ఓటమి వెంటాడుతూనే ఉంటుంది. సమయానికి పని పూర్తి చేయలేని వాళ్లు.. సమయపాలన లేని వాళ్లు ఎప్పుడూ జీవితంలో గెలవలేరు అని చెప్పుకొచ్చారు చాణక్యుడుఅలాగే.. కొందరికి చిన్న చిన్న విషయాలకే కోపం వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్లు కూడా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది. గెలుపును దూరం చేసుకోవడమే కాదు.. కోపంతో ఉన్న వ్యక్తులు అన్నింటినీ దూరం చేసుకుంటారు అంటూ చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పుకొచ్చారు.