శ్రావణ పూర్ణిమ రోజు స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేసి చేస్తే .. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది .. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

శ్రావణ పూర్ణిమ రోజు స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేసి చేస్తే .. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ..

 Authored By aruna | The Telugu News | Updated on :31 August 2023,9:00 am

హిందూ పురాణాలలో శ్రావణమాసం చాలా విశిష్టమైన మాసం. ఇక శ్రావణ మాస పౌర్ణమి నాడు రాఖీ పండుగను జరుపుకుంటాం. అందుకే దీనిని రాఖీ పౌర్ణమి అని అంటారు. అలాగే ఈ పౌర్ణమి రోజున బ్రాహ్మణులు కొత్త జంధ్యాలను ధరిస్తారు.అందుకే దీనిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు.ఎంతో విశిష్టమైన శ్రావణ పౌర్ణమి నాడు మనం చేసే పనులు మంచిని సంతరించుకుంటాయి. ఈరోజు ముఖ్యంగా మనం చేసే స్నానం ప్రాముఖ్యతను చోటు చేసుకుంటుంది. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.శ్రావణ పౌర్ణమి రోజు మనం చేసేటువంటి స్నానం ఏ విధంగా ఉండాలి అందులో ఏ పదార్థాలు వేస్తే జన్మజన్మల పాపాలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

మన ఏడు జన్మల పాపాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఈ శక్తివంతమైన శ్రావణ పౌర్ణమి నాడు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయాలి. బకెట్ నీళ్లలో పసుపు, గంధం, చిటికెడు కుంకుమ, అక్షింతలు కలుపుకొని చక్కగా అభ్యంగన స్నానం చేయాలి. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా ఇలా స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. శ్రావణ మాస పౌర్ణమి రోజున ఈ పదార్థాలు కలుపుకొని చేయడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి. మంగళకరమైన వస్తువులు కలపడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురోహితులు చెబుతున్నారు. శ్రావణ మాస పౌర్ణమి రోజు యజ్ఞోపవీత ధారణ చేసేవాళ్లు, అలాగే రాఖి కట్టించుకునే వాళ్ళు రాఖీ కట్టే వాళ్ళు ఈ అభ్యంగన స్నానం చేయాలి.

put this in the bath water get Lakshmi Kataksham

put this in the bath water get Lakshmi Kataksham

సూర్యుడు ఉదయించక ముందే ఈ అభ్యంగన స్నానం చేయాలి. ఉదయాన్నే లేచి పరిసరాలు శుభ్రంగా చేసుకొని ఈ అభ్యంగన స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. శక్తివంతమైన శ్రావణ పౌర్ణమి నాడు ఇలా చేస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు ఇలా అభ్యంగన స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. మన హిందూ పురాణాలలో ఏదైనా పండుగ వస్తే ఈ అభ్యంగన స్నానం చేస్తారు. ఇలా చేయడం వలన చాలా మేలు జరుగుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. అందుకే వీలైనంతవరకు ప్రతి ఒక్కరూ శక్తివంతమైన ఈ శ్రావణ మాస పౌర్ణమి నాడు స్నానం చేసే నీటిలో ఈ మంగళకరమైన వస్తువులను వేసి చేస్తే మేలు జరుగుతుంది.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది