Hair Cutting : మంగళవారం రోజు జుట్టు కత్తిరిస్తే ఏమవుతుంది…జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే…?
ప్రధానాంశాలు:
Hair Cutting : మంగళవారం రోజు జుట్టు కత్తిరిస్తే ఏమవుతుంది...జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే...
అసలు మంగళవారం జుట్టు ఎందుకు కట్ చేసుకోకూడదు. దానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం....
Reason behind why can't cut the hair on tuesday...
ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో జుట్టును కత్తిరించుకోవడం సహజం. కానీ మంగళవారం రోజు మాత్రం ఎవరు జుట్టు కత్తిరించరు. అయితే దీనికి గల కారణం ఏంటనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మరి ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో దీనిని ఎక్కువగా ఆచరిస్తారు. దీంతో చాలాకాలంగా భారతీయ ప్రజలు మంగళవారం ఎయిర్ కట్ చేయకూడదని నమ్ముతున్నారు. అంతేకాక దీనిలో కొన్ని పురాతన నమ్మకాలు జ్యోతిష్య శాస్త్రం మరియు సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. అసలు మంగళవారం జుట్టు ఎందుకు కట్ చేసుకోకూడదు. దానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రంలో మంగళవారం అనేది హనుమంతుడికి అంకితం చేయబడింది. పురాణాల ప్రకారం మంగళవారం రోజు జుట్టు కత్తిరించుకోవడం హనుమంతుడిని అవమానించినట్లుగా భావిస్తారు. అలాగే మంగళవారం రోజు జుట్టు కత్తిరించుకోవడం వలన ఆయుష్షు తగ్గుతుందని నమ్ముతారు. అందుకే జుట్టు కత్తిరించుకోవడానికి మంగళవారం శుభకరమైన రోజు కాదని హిందువుల నమ్మకం.
అలాగే మంగళవారం అనేది గ్రహాలలో అంగారక గ్రహానికి సంబంధించిందిగా చెబుతుంటారు. ఇక అంగరక గ్రహం అనేది ఉగ్ర స్వభావం కలిగిన గ్రహం. కావున మంగళవారం రోజు జుట్టు కత్తిరిస్తే అంగరక గ్రహ ప్రభావం కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అందుకే మంగళవారాన్ని కేవలం శుభకార్యాలకు అనువైన రోజుగా భావిస్తారు. ఇక ఈ మంగళవారం రోజు దేవతలను పూజించడం శుభకార్యాలు చేయడం వంటివి చేయడం చాలా శుభప్రదం.
అంతేకాక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు ఏదో ఒక గ్రహం యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం అంగారపు గ్రహ ప్రభావం కారణంగా శరీరానికి హాని కలిగే పనులు చేయకూడదు. దానిలో జుట్టు కత్తిరించుకోవడం కూడా ఒకటి.
అయితే మంగళవారం రోజు జుట్టు కత్తిరించుకోవడం అనేది వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ నమ్మకాన్ని పాటించాలా వద్దా అనేది మీ ఇష్టం. శాస్త్రీయంగా అయితే మంగళవారం రోజు జుట్టు కత్తిరించుకోవడం అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.