Rudraksha : మీ రాశుల ప్రకారం.. ఈ రుద్రాక్షలను ధరిస్తే జీవితంలో అన్ని శుభాలే..
Rudraksha : పరమ శివుడి అనుగ్రహం పొందాలంటే కనుక కంపల్సరీగా వారు రుద్రాక్షను ధరించాలని పెద్దలు చెప్తుంటారు. శైవ భక్తులు ఈ విషయం గురించి వివరిస్తుంటారు. మహాదేవుడి పూజలో రుద్రాక్షలను సమర్పిస్తుంటారు. ఈ రుద్రాక్షలు భోళా శంకరుడి కన్నీటి నుంచి ఉద్భవించినవని భక్తులు నమ్ముతుంటారు. రుద్రాక్ష ధరించడం వలన శుభ పలితాలు వస్తాయని పురాణాలలో పేర్కొన్నారు. రుద్ర పురాణంలో ముఖ్యంగా రుద్రాక్ష ధారణ వలన కలిగే ప్రయోజనాలు వివరించారు. అయితే, ఆయా రాశుల ప్రకారం ఏయే రుద్రాక్షలు ధరించాలనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.
Rudraksha : రుద్రాక్షలలో పలు రకాలు..
పండితులు చెప్తున్న దాని ప్రకారం.. ఆయా రాశుల వారు వారి రాశులకు అనుగుణంగానే రుద్రాక్షణలను ధరించాల్సి ఉంటుంది. వివిధ పరిణామాలు, చారలలో రుద్రాక్షలు ఉండటాన్ని మనం గమనించొచ్చు. ప్రతీ ఒక్క రుద్రాక్ష కూడా విభిన్నమైన గుణాన్ని కలిగి ఉండటం మనం పరిశీలించొచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆయా రాశులకు చెందిన వారు నవగ్రహాలకు సంబంధించినటువంటి ఈ రుద్రాక్షలను ధరించవచ్చును. శివుని అనుగ్రహం ఈ రుద్రాక్షను ధరించడం వలన కలుగును.
ఈ రాశుల వారికి ఈ రుద్రాక్షలు ధరించడం వలన చాలా చక్కటి ప్రయోజనాలుంటాయని జ్యోతిష్య శాస్త్ర పెద్దలు చెప్తున్నారు. మేష రాశి వారు తమ అదృష్టం పొందడం కోసం ఒక ముఖి, రెండు ముఖి, ఐదు ముఖి రుద్రాక్షలను ధరించాలి. వృషభ రాశి వారు అయితే కనుక
చతుర్ముఖ, షట్ ముఖ, పధ్నాలుగు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలను ధరించాలి.
Rudraksha : మిథున రాశి వారు చతుర్ముఖ, ఐదు ముఖాలు, పదమూడు ముఖాల రుద్రాక్షలను ధరించాలి.కర్కాటక రాశి వారు మూడు, ఐదు, గౌరీ శంకర్ రుద్రాక్షలను ధరించాలి. సింహ రాశి వారికి మూడు, ఐదు ముఖాలు కలిగిన రుద్రాక్షలను ధరించాల్సి ఉంటుంది. తుల రాశి వారు కూడా అంతే. కానీ, వీరు చతుర్ముఖ, ఆరు, పధ్నాలుగు ముఖాల రుద్రాక్షలను ధరించాలి. కన్య రాశి వారు అయితే కనుక నాలుగు, ఐదు, పదమూడు ముఖాల రుద్రాక్షలను ధరించవచ్చును. మకరరాశి వరు నాలుగు, ఆరు, పధ్నాలుగు ముఖాల రుద్రాక్షలను ధరించాలి.