Sankranthi Astrology : మకర సంక్రాంతి నుంచి ఈ రాశులకు అధికార యోగం… వీరి ఇంట సిరుల వర్షం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sankranthi Astrology : మకర సంక్రాంతి నుంచి ఈ రాశులకు అధికార యోగం… వీరి ఇంట సిరుల వర్షం…?

 Authored By ramu | The Telugu News | Updated on :11 January 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Sankranthi Astrology : మకర సంక్రాంతి నుంచి ఈ రాశులకు అధికార యోగం... వీరి ఇంట సిరుల వర్షం...?

Sankranthi Astrology : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులో సూర్యుని గ్రహానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సూర్యునిని గ్రహాల రాజుగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు, ఆరోగ్యాన్ని, అధికారాన్ని, గుర్తింపు వంటి అంశాల కు రవి కారకుడుగా పరిగణిస్తారు. అందుకనే సూర్యుడు మారినప్పుడల్లా కొన్ని రాశులకు మంచి జరుగుతుంది. ఏ గ్రహమైన సరే ఆ గ్రహం యొక్క యోగం కలిగించకుండా రాసి మారదని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు తెలియజేశారు. ఈ మాసంలో జనవరి 16వ తేదీన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించబోతుంది. ఈ సూర్య భగవానుడు ఫిబ్రవరి 16 వరకు అదే రాశిలోనే కొనసాగుతుండు. ఈ సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించడం వలన మకర సంక్రాంతి అని పిలవబడుతుంది. మరి సూర్య భగవానుడు ఏ ఏ రాశుల్లో సంచారం చేయబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం…

Sankranthi Astrology మకర సంక్రాంతి నుంచి ఈ రాశులకు అధికార యోగం వీరి ఇంట సిరుల వర్షం

Sankranthi Astrology : మకర సంక్రాంతి నుంచి ఈ రాశులకు అధికార యోగం… వీరి ఇంట సిరుల వర్షం…?

Sankranthi Astrology మేషరాశి

ఈ మేష రాశిలో 10వ స్థానంలో రవి సంచారం చేస్తున్నాడు. దీనివల్ల మేష రాశి వారికి దిగ్బల యోగం పట్టబోతుంది. యోగం కలిగే వారికి ఉద్యోగంలో అధికారం గా వీరిదే పై చేయి ఉంటుంది. వ్యాపారాలనైనా చేసే వృత్తిలో అయినా వీరికి మంచి డిమాండ్ పెరుగుతుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగా ఫలితాలు వస్తాయి. ఉద్యోగం లేకుండా ఉన్నవారికి తమ సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీ ఆస్తులు విషయంలోనూ, ఆర్థికంగానూ మీ పుట్టింటి సహకారాలు మీకు సంపూర్ణంగా ఉంటాయి.

వృషభ రాశి :  ఈ వృషభ రాశి వారికి పలు విషయాల్లో తండ్రితో సానుకూలతలు ఏర్పడతాయి. ఈ వృషభ రాశి వారికి ఆర్థిక, ఆస్తి లావాదేవీలు తండ్రి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు వీరికి వస్తుంది. అంతేకాదు ధన యోగం కూడా కలుపుతుంది. ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడే వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా నిరుద్యోగులకు,ఉద్యోగం చేసే వారికి విదేశాలకు మంచి అవకాశాలు వస్తాయి. చేసే ఉద్యోగంలో వీరికి అధికారకంగా పదోన్నతి లభిస్తుంది.

కర్కాటకం : కర్కాటక రాశికి చెందిన అవివాహితులకు సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి అయ్యే అవకాశం ఉంది . ఉద్యోగంలో అధికారకంగా యోగం వస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం వాలి అనుకునే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొద్ది ప్రయత్నంలోనే ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. పిత్రార్జితం లభిస్తుంది.

తులారాశి : తులా రాశి వారికి ఏ ఆరోగ్యం చాలా బాగుంటుంది. గృహం, వాహనాలు కొనుగోలు సంబంధించిన ప్రయత్నాలు కలసి వస్తాయి. ఆస్తులు విలువలు పెరుగుతాయి. మీ పుట్టింటి వైపు నుంచి సంపదలు లభిస్తాయి. మీరు చేసే ఉద్యోగంలోనే కాదు సామాజికంగా కూడా మీకు హోదా పెరుగుతుంది. నిరుద్యోగులకు మీరు ఆశించినట్లుగానే మీకు దగ్గరలోనే మీ ఊర్లోనే ఉద్యోగం వస్తుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి అనేకమార్గాల్లో ఆదాయం వృత్తి చెందుతుంది. బ్యాంకులలో డబ్బు నిండుగా ఉంటుంది. ఆస్తి వివాదాలు కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారతాయి. ఆదాయం పెరగడానికి ఇవే ప్రయత్నం చేసిన కూడా మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి వ్యక్తితో పెళ్లి ఖాయం అవుతుంది.

మీన రాశి : ఈ రాశి వారికి లాభ స్థానంలో రవి సంచారం జరుగుతుంది కావున ఏలినాటి శని దోషం వీరికి ఉంది. కానీ రాహు కేతువుల దోషము వంటివన్నీ బాగా బలహీనపడతాయి. అయితే లాభ స్థానంలో రవి సంచరిస్తున్నప్పుడు జాతకంలో కోటి దోషాలు ఉన్న తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. వీరికి ఆదాయం చాలా బాగా వృద్ధి చెందుతుంది. పుట్టింటి నుంచి ఆస్తులు లభిస్తాయి. దేశ వృత్తిలో పదోన్నతి వస్తుంది. ఇప్పటిదాకా ఉన్న ఆస్తి వివాదాలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ప్రభుత్వం నుంచి మీకు ధనం అందే అవకాశం ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది