Tulsi Pooja : తులసిని పూజించేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పకుండ పఠించాలి .. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ..
Tulsi Pooja : హిందువులు తులసి మొక్కను పవిత్రమైనదిగా భావిస్తారు. దేవుడితో సమానంగా కొలుస్తారు. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని విశ్వాసం. కాబట్టి తులసిని పూజించడం వలన ఆర్థికపరంగా మంచిగా ఉంటామని నమ్మకం. తులసిని పూజించడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించి సంతోషం, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. తులసి పూజకు సంబంధించిన గ్రంథాల్లో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. తులసి మొక్కను ఇంట్లో సరైన దిశలో ఉంచి నియమ నిబంధనల ప్రకారం పూజించడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి.
హిందూ మత గ్రంథాల ప్రకారం తులసిని క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆరాధించడం వలన లక్ష్మీదేవితో పాటు విష్ణువు ఆశీర్వాదాలు కలుగుతాయి. అయితే తులసిని స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజించాలి. తులసికి నీరు ఎక్కువగా సమర్పించకూడదు. హిందూ పురాణాల ప్రకారం సూర్యోదయం తర్వాత తులసికి నీరు సమర్పించడం మంచిది. ఆదివారం నాడు తులసిని అస్సలు పూజించకూడదు. ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి మిగిలిన రోజు. ఏకాదశి రోజు కూడా తులసికి నీరు సమర్పించకూడదు. తులసి పూజ సమయంలో నీరు సమర్పించేటప్పుడు తులసి మంత్రాన్ని జపించడం
మరింత ఫలవంతం అని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగటమే కాకుండా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇంట్లో సుఖసంతోషాలు సౌభాగ్యం శాంతి నెలకొంటుంది. విష్ణువు అనుగ్రహంతో కుటుంబ సభ్యులు ఆరోగ్యం బాగుంటుంది. తులసికి నీటిని సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని కచ్చితంగా భక్తితో జపించాలి. ” మంత్రం మహాప్రసాద్ జనని సర్వ సౌభాగ్య వర్ధిని ఆది వ్యాధి హర నిత్యం తులసీ త్వం నమోస్తుతే “అనే మంత్రాన్ని జపించాలి. ఇంట్లో తులసిని ఈశాన్య దిశలో నాటితే మంచిది. తులసిని పెట్టేటప్పుడు ముఖాన్ని తూర్పు దిశలో ఉంచాలి. దక్షిణ దిశలో తులసిని అస్సలు నాటకూడదు.