Chanakya Niti : ఇలా చేస్తే సక్సెస్ అవుతామని చెప్తున్న చాణక్య నీతి.. తప్పక పాటించండి.
Chanakya Niti : కౌటిల్యుడు గొప్ప రాజనీతి శాస్త్రజ్ఞుడు.. జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశాడు. తను రచించిన నీతి శాస్త్రంలో చెప్పిన విషయాలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. రాజకీయ, సామాజిక, నైతిక అంశాలను చాణక్య నీతిలో వెల్లడించారు. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దం, మూడో శతాబ్దం మధ్యకాలంలో జీవించిన గొప్ప మేధావి చాణక్య. కౌటిల్యుడి పేరు చెప్పగానే అర్థశాస్త్రం గుర్తొస్తుంది. అపారమైన రాజనీతిజ్ఞత వందల సంవత్సరాలు నిరంతరాయంగా పాలించిన నందవంశాన్ని ఓడించేలా చేసి మగధ సింహాసనంపై చంద్రగుప్తుడిని కూర్చోబెట్టిన అపర మేధావిగా కీర్తింపబడ్డాడు కౌటిల్యుడు.
దౌత్యవేత్తగా, రాజనీతి కోవిదుడిగా, ఆర్థికవేత్తగానూ చెప్పుకోబడ్డ చాణక్య జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశాడు. అవి నేటికీ ఎంతో ఉపయోగపడుతున్నాయి.చాణక్య మనిషి జీవన విధానాలను చాలా చక్కగా వివరించాడు. జీవితంలో సక్సెస్ కావాలంటే ఏ నియమాలు పాటించాలనేదనిపై ప్రస్తావించాడు. ఎవరితో స్నేహం చేయాలి. ఎలా మాట్లాడాలి.. ఎవరికి దూరంగా ఉండాలో తన నీతి శాస్త్రంలో వివరించాడు. పిల్లలను ఎలా పెంచాలి.. భార్య భర్తలు ఎలా ఉండాలి.. కోపం, స్వార్థం మనిషిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలిపాడు. అందుకే ఇప్పటికీ యువత చాణక్య నీతి శాస్త్రాన్ని ఫాలో అవుతుంటారు.
చాణక్య నీతి ప్రకారం కోపం మనిషి వినాశనాన్ని కోరుకుంటుంది. కోపంలో తీసుకునే నిర్ణయాలతో ఇబ్బంపడతారు. కోపంతో ఇతరులకు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే కోపం తగ్గించుకుని శాంతంగా ఉండాలని చెప్పాడు. కోపం తనపైనే కాకుండా పక్కన ఉన్నవారిపై కూడా ప్రభావం చూపిస్తుందిని వివరించాడు. అలాగే అబద్దాలు చెప్పే వ్యక్తి ఆ అబద్దల్లోనే బతికేస్తాడు. ఆ తర్వాత నిజం చెప్పినా ఎవరూ నమ్మే అవకాశం ఉండదు. దీంతో సొసైటీలో గౌరవ మర్యాదలు కోల్పోతాడు. అందుకే అబద్దాలు చెప్పకపోవడమే మంచిదని సూచించాడు.