Shasta Graha Kutami : షష్ఠగ్రహకూటమి ఫలితాలు ఇవే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shasta Graha Kutami : షష్ఠగ్రహకూటమి ఫలితాలు ఇవే !

 Authored By keshava | The Telugu News | Updated on :11 February 2021,5:00 am

Shasta Graha Kutami షష్టగ్రహకూటమి ఈ మాట గతేడాది నుంచి విపరీతంగా వాడుతున్నారు. గతేడాది కూడా ఇలానే ఆరుగ్రహాలు ఒక దగ్గరకు వచ్చాయి. తిరిగి ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో కూడా ఆరుగ్రహాలు ఒకరాశిలోకి వస్తున్నాయి. వాటి ఫలితాలు తెలుసుకుందాం…

గతేడాది ఆరుగ్రహాల కలయిక కరోనా లాంటి మహ్మారికి దారితీసిందని చాలామంది అభిప్రాయం. ప్రస్తుతం ఏం జరుగుతుందో నని భయం. ఇలాంటి గ్రహ సంయోగం ఉన్నప్పుడల్లా ఏదో ఒక అరిష్టానికి తెరతీసినట్లవుతోంది. సాధారణంగా ప్రతి 59 ఏళ్లకూ ఒకసారి ఆరు కంటే ఎక్కువ అంటే 6, 7, 8 గ్రహాలు ఒకే రాశిలో కలవడం జరుగుతుంది. 2019లో డిసెంబరు 26 నుంచి 28 వరకూ ఈ షష్ఠ గ్రహ కూటమి సంభవించింది. తిరిగి ఫిబ్రవరిలో 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ షష్ఠ గ్రహ కూటమి కొనసాగుతుంది. 10 ఫిబ్రవరి 2021 బుధవారం రాత్రి చంద్రుడు మకరంలో ప్రవేశించిన తర్వాత ఈ మహాసంయోగం ఏర్పడుతుంది. ఇది చాలా అరుదుగా జరిగే అధ్భుత ఖగోళ ఘటన. నవగ్రహాల్లో ఆరు గ్రహాలు మకర రాశిలో ఉంటాయి.

Shasta Graha Kutami Effects in 2021

Shasta Graha Kutami Effects in 2021

Shasta Graha Kutami : 1962 ఫిబ్రవరి లో  కూడా షష్ఠగ్రహకూటమి

2019లో షష్ఠ గ్రహ కూటమి ఏర్పడి నప్పుడు కాలసర్ప దోషం ఏర్పడింది. అన్ని గ్రహాలూ రాహుకేతువు మధ్య బందీ అవడాన్ని కాలసర్పదోషం అంటారు. ఈసారి కూడా అలానే జరిగింది. మనకున్న నవగ్రహాల్లో ఎనిమిది గ్రహాలు ఒకే రాశిలో కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1962 ఫిబ్రవరి 4, 5 తేదీల్లో ఇలాంటి అష్ట గ్రహ కూటమి ఏర్పడింది. అప్పుడు 8 గ్రహాలు మకర రాశిలో కలిశాయి. ఆ ఏడాది రష్యా, అమెరికాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ పరిణామం యుధ్దాలకు దారితీసింది. అంతటా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. 2019 డిసెంబరులో ధనుస్సు రాశిలో శని, కేతువు, గురువు, చంద్ర, రవి, బుధ గ్రహాలు కలిశాయి. కచ్చితంగా అదే సమయంలోనే వైరస్ ప్రబలడం మొదలైంది. ఇలాంటి గ్రహ కూటములు ఏర్పడటం అరుదైన విషయమే అయినా దీనికి వైరస్ పుట్టుకకూ ఏదైనా సంబంధం ఉందా లేదా అనేది తేలాలి.

ఈసారి రాహుకేతువులు ఈ ఆరు గ్రహాలకూ దూరంగా ఉన్నాయి. ప్రస్తుతం మకర రాశిలోకి గ్రహ కలయికల వల్ల విపత్కర పరిస్థితులు కలగవచ్చని జ్యోతిష పండితులు అంటున్నారు. రానున్న రెండు నెలల కాలంలో కొన్ని విపత్కర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. చైనా, పాకిస్థాన్ లు చాలా ఇరకాటంలో పడవచ్చని కూడా అంటున్నారు. భారత్ పై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని జ్యోతిష్కులు అంటున్నారు. మకరం అనేది కర్మ స్థానం. ఈ రాశిలో ఆరు గ్రహాలు కలవడం అన్నది భౌగోళిక, రాజకీయ పెనుమార్పులకు నాంది పలికే అవకాశం ఉంద.

కుజ, శని, గురు గ్రహాలు ఒకే రాశిలో ఉంటే యుద్ద వాతావరణాలు నెలకొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. పైగా కుజుడికి మకరం ఉచ్ఛరాశి. ప్రజల్లో తిరుగుబాటుకు ఈ గ్రహ కలయిక తోడ్పడవచ్చన్నది జ్యోతిష్కుల అంచనా. జ్యోతిష శాస్త్ర అంచనా ప్రకారం దేశ ప్రముఖులలో ఒకరికి ప్రాణహాని జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. వ్యక్తిగత జాతక చక్రం ఆధారంగా ఫలితాలలో మార్పులు ఉండవచ్చు. పలు ఆందోళనలు, ఉద్యమాలు, ఆధ్యాత్మిక విభేధాలు రావడానికి ఆస్కారం ఉందని పెద్దలు చెప్తున్నారు. ఏది ఏమైనా విశ్వంలో జరిగే ఈ అద్భుత ఖగోళ సంఘటన ఒక మరుపురాని ఘట్టంగా మిగిలిపోతుంది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది