Shravana Masam : శ్రావణమాసంలో ఈ పువ్వులతో శివుడిని పూజిస్తే కటిక దరిద్రమైన తీరిపోతుంది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shravana Masam : శ్రావణమాసంలో ఈ పువ్వులతో శివుడిని పూజిస్తే కటిక దరిద్రమైన తీరిపోతుంది…!!

 Authored By ramu | The Telugu News | Updated on :3 August 2024,8:00 am

Shravana Masam : శ్రావణమాసంలో కనీస ఒక్కరోజైనా శివుడికిి అత్యంత ఇష్టమైన ఈ పువ్వులను సమర్పిస్తే ఎనలేని ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. అంతేకాదు ఈ పువ్వులను సమర్పించడం వలన మీకు ఆ పరమశివుడు వరాల జల్లు కురిపిస్తాడు. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ పువ్వులతో పూజ జరిపిస్తే కలలో కూడా ఊహించని ఫలితం కలిగి మీకు పట్టిన దరిద్రం తొలగిపోతుంది. మరి అ పూలే ఏంటో ఇప్పుడు మనం వివరంగాా తెలుసుకుందాం… శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో శివుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమశివుడిని ఆరాధిస్తారు. సాధారణంగా పరమశివుడు అంత త్వరగా కరుణించడు. కానీ ఆ పువ్వులతో పూజ చేస్తే ముక్కంటి అనుగ్రహం త్వరగా లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు.

బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఒకరైన పరమేశ్వరుడికి సోమవారం ఎంతో ప్రీతిప్రాతమైన రోజు అందుకనే భక్తులు ప్రతి సోమవారం తెల్లవారుజాము నుంచే పూజలు చేసి ముక్కలను చెల్లిస్తారు. అయితే మహాదేవుడి ఆశీస్సులు సులభంగా దొరకవు. పూర్వంలో కఠోర తపస్సులు చేస్తే తప్ప స్వామి కరుణించేవాడు కాదు. మరి మనం కూడా అలా చేయాలంటే చాలా కష్టం. అందుకే ఈ రోజుల్లో భక్తులు సులభమైన మార్గాలను వెతుక్కుంటున్నారు. స్వామికి ఏది ఇష్టమో దానిని సమర్పించి అనుగ్రహాన్ని పొందుతున్నారు. మహాశివుడికి బిల్వ వృక్షం ఆకులన్నా పువ్వులన్నా చాలా ఇష్టం. ఈ పువ్వులు ఎక్కడపడితే అక్కడ కనిపించవు చాలా అరుదుగా ఇవి ఉంటాయి. అందువలన మీరు శివుడికి ఇష్టమైన పూజ చేయాలి అనుకుంటే ముందు బిల్వపత్రాలను పువ్వులను సేకరించాల్సి ఉంటుంది. ఈ పువ్వులతో కలిగే పూజ ఫలం అంతా ఇంతా కాదని పండితులు చెబుతున్నారు. మీరు జీవితాంతం చేసినటువంటి పూజా ఫలితాలను ఒక్క బిల్వ పువ్వుతో పూజించడం ద్వారా పొందగలరని చెబుతున్నారు.

అంతల స్వామికి అ పువ్వులు అంటే ఇష్టమైన మాట. పురాణాల ప్రకారం మరో విశేషం కూడా ఉంది. ఈ పువ్వుతో పూజ చేసిన వారు చనిపోయిన తర్వాత కైలాశానికి వెళ్తారని ప్రతిదీ. ఒకవేళ ఈ పువ్వులు మీకు లభించకపోతే కనీసం బిల్వ పత్రాలతోటైన పూజ చేయవచ్చు. అవి అంటే కూడా స్వామికి విపరీతమైన ఇష్టం. నేటి కాలంలో ఇవి ఆన్ లైన్ కూడా లభిస్తున్నాయి. ఒకవేళ ఇవి ఎండిపోయిన పర్వాలేదని వాటితో స్వామి కరుణిస్తాడని పండితులు చెబుతున్నారు. మారేడు దళాలు స్వామికి చాలా ఇష్టం. పవిత్రమైన ఈ పత్రాలతో పూజించడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది. అంతేకాదు వీటిని త్రిమూర్తులకు చిహ్నంగా భావిస్తారు. నాగవల్లి పుష్పం శివునికి అత్యంత ఇష్టమైనది పుష్పం. వీటితో శివుడిని పూజిస్తే అనుగ్రహిస్తాడు. శంఖం పూలు కేవలం శివారాధన కోసం మాత్రమే వినియోగిస్తారు. ముదురు నీలం రంగులో ఉండే ఈ పుష్పాలతో పూజిస్తే దేవతలు ప్రసన్నమవుతారు. సంపంగి పువ్వుల సువాసన అంటే దేవతలకు చాలా ప్రీతి వీటితో పూజించిన వారికి శివుడి కటాక్షం దొరుకుతుంది. ఎల్లప్పుడు సంతోషంగా ఉంటారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది