Pigeon : వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పిచ్చుక లేదా పావురం గూడు కడితే ఏమవుతుందో తెలుసా ..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pigeon : వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పిచ్చుక లేదా పావురం గూడు కడితే ఏమవుతుందో తెలుసా ..??

 Authored By aruna | The Telugu News | Updated on :30 September 2023,11:00 am

Pigeon : మన భారతీయులు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. వాటిలో కొన్ని పక్షులు మనకు శుభ సూచకంగా, మరికొన్ని పక్షులు అశుభ సూచకంగా పరిగణిస్తారు. పక్షులు మన ఇళ్లల్లో గూడు కట్టుకోవడం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా నగరాల్లో బాల్కనీలలో పావురాలు గూడు కట్టుకొని జీవిస్తూ ఉంటాయి. సాధారణంగా పిచ్చుకలు చిన్న చిన్న గూళ్లు కట్టుకొని జీవిస్తూ ఉంటాయి. అయితే పిచ్చుకలు లేదా పావురాలు మన ఇళ్లల్లో గూడు కట్టుకొని తిరగటం వలన మనకు ఏమైనా సమస్యలు వస్తాయా అనేది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం తెలుసుకుందాం.

వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి బాల్కనిలో లేదా కిటికీలో పిచ్చుక గూడు కట్టుకుంటే అది శుభ సూచకంగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి మీపై సంతోషంగా ఉండబోతుందని మరియు మీరు ఆకస్మాత్తుగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని దీనికి సంకేతం. అలాగే ఇంటికి తూర్పు వైపున పిచ్చుక తన గూడును నిర్మిస్తే అది ఆనందం, శ్రేయస్సు మరియు గౌరవానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇంటికి ఆగ్నేయ దిశలో పిచ్చుక గూడు కట్టుకుంటే అది ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగబోతున్నాయని తెలుపుతుంది. అలాగే నైరుతి దిశలో పిచ్చుక గూడు కట్టుకుంటే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం కాకుండా అధిక ధనలాభం కూడా చేరుతుంది.

sparrow or pigeon nests in a house

sparrow or pigeon nests in a house

ఈ విధంగా పిచ్చుక ఇంట్లో గూడు కట్టుకోవడం వలన గ్రామాలలో పంటలు బాగా పండుతాయి. అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం పావురం ఇంటి బాల్కనీలో లేదా కిటికీలో గూడు నిర్మిస్తే అది దురదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది. అలాగే ఇంట్లో తేనెటీగలు గూడు కట్టిన ఇంటికి మంచిది కాదు. దీని వలన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లో గబ్బిలాలు చేరినా కూడా వాస్తు శాస్త్ర ప్రకారం అస్సలు మంచిది కాదు. భవిష్యత్తులో చాలా సమస్యలు రావచ్చని దానికి సంకేతం. అలాగే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది