Marriage : ఫీలవకండి.. మీకు పెళ్లి కావడం లేదా.. అయితే ఇలా చేసిచూడండి..!
Marriage : కొంత మందికి పెళ్లి సంబంధాలు అంత తొందరగా కుదరవు. పది సార్లు పెళ్లి చూపులను ఏర్పాటుచేసినా మ్యాచ్ ఫిక్స్ కానివాళ్లు బోలెడంత మంది. దీనికి సవాలక్ష కారణాలు ఉంటాయి. వాటిలో వాస్తు లోపం ఒకటి. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అంటుంటారు. కానీ ఆ ఇంటిని సరిగా నిర్మించకపోతే, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకపోతే ‘పెళ్లి కాని ప్రసాద్’లా మిగిలిపోతారు. అందుకని వివాహం కాని బాధితులు ఒకసారి తమ ఇంటి […]
Marriage : కొంత మందికి పెళ్లి సంబంధాలు అంత తొందరగా కుదరవు. పది సార్లు పెళ్లి చూపులను ఏర్పాటుచేసినా మ్యాచ్ ఫిక్స్ కానివాళ్లు బోలెడంత మంది. దీనికి సవాలక్ష కారణాలు ఉంటాయి. వాటిలో వాస్తు లోపం ఒకటి. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అంటుంటారు. కానీ ఆ ఇంటిని సరిగా నిర్మించకపోతే, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకపోతే ‘పెళ్లి కాని ప్రసాద్’లా మిగిలిపోతారు. అందుకని వివాహం కాని బాధితులు ఒకసారి తమ ఇంటి వాస్తు ఈ కింది విధంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. దోషాలుంటే సవరించుకోండి. పెళ్లెందుకు కాదో అప్పుడు అడగండి.
ఎంట్రన్స్.. ఇంపార్టెన్స్..
ఇంటి ప్రవేశ ద్వారం ఆగ్నేయ దిశలో(తూర్పు, దక్షిణ దిక్కులకు మధ్యలో) ఉంటే పెళ్లి సంబంధాలు కుదిరే ఛాన్స్ తక్కువ. ఈ లోపాన్ని సరిచేయటానికి గదుల మూలల్లో అద్దాలను వేలాడదీయాలని, తద్వారా డైరెక్షన్ మారుతుందని నిపుణులు చెబుతున్నారు. బెడ్రూమ్ నైరుతి దిశలో(దక్షిణ, పడమర దిక్కులకు మధ్యలో) ఉండేలా చూసుకోవాలి. పడక గదిలో డ్రస్సింగ్ టేబుల్.. బెడ్ కి ఎదురుగా ఉండకూడదు. బెడ్ కి పక్కన పెట్టుకోవాలి. నీటికి సంబంధించిన నిర్మాణాలను(కొలనులు, స్విమ్మింగ్ పూల్స్, ఫౌంటెయిన్స్, కుండలు, తొట్లు ఏవైనా) ఈశాన్య దిశలో(ఉత్తర, తూర్పు దిక్కులకు మధ్యలో) ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే ప్రతికూల ప్రభావం పడుతుంది.
కొత్త దంపతుల మధ్య కొర్రీలు.. : Marriage
ఆగ్నేయ దిశలో (తూర్పు, దక్షిణ దిక్కులకు మధ్యలో) పడక గది ఉంటే కొత్త దంపతుల మధ్య కొర్రీలు వస్తాయని, డబ్బులు పోయే ప్రమాదం ఉందని వాస్తుశాస్త్రవేత్తలు వార్నింగ్ ఇస్తున్నారు. ఇంట్లో షార్ప్ గా ఉండే వస్తువులను ఓపెన్ గా అందరికీ కనిపించేలా పెట్టకూడదు. ఏదైనా కవర్, క్లాత్ తో క్లోజ్ చేసి ఉంచాలి. ఇంట్లో సీతాకోక చిలక, రామ చిలక, బాతు వంటి ఏ బొమ్మలైనా రెండు చొప్పున ఉండాలి. ఒకటి పెట్టకూడదు. బెడ్ రూమ్ గోడలపై సముద్రం ఫొటోలు పెట్టుకోవచ్చు. పడక గది గోడలకు లైట్ గ్రీన్, లైట్ రోజ్, లైట్ బ్లూ కలర్ పెయింట్లు వేయాలి. బెడ్ షీట్ల కలర్ కూడా లైట్ గానే ఉండాలి. వెలుతురు సైతం ధారాళంగా కాకుండా మామూలుగా ఉండాలి.