Vasthu Tips In Telugu : ఈ నియమాలు పాటిస్తే వందశాతం వాస్తు ఉన్నట్లే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vasthu Tips In Telugu : ఈ నియమాలు పాటిస్తే వందశాతం వాస్తు ఉన్నట్లే !

 Authored By keshava | The Telugu News | Updated on :14 March 2021,8:00 am

Vasthu Tips In Telugu : వాస్తు… ప్రతిచోట సర్వసాధారణంగా వినిపించే మాట. గృహం, ఆఫీస్, షాప్ ఇలా ఏదైనా సరే వాస్తుకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటారు అందరూ. అయితే దాదాపు వంద శాతం వాస్తు అనేది సాధ్యమైనా? మరి కాకుంటే ఏం చేయాలి? దీనిపై పండితులు, వాస్తు శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం…

అయితే అన్ని చోట్ల వంద శాతం సాధ్యం కాదు. దీనికి కారణం ప్రస్తుతం నలుదిక్కులు సమానంగా, క్రాస్లు, కోణాలు, పోట్లు లేకుండా ఖాళీ స్థలాలు దొరకవు. దీనికి తోడు సమానంగా ఉన్నా అన్ని సౌకర్యాలు కావాలంటే తప్పనిసరిగా కొన్ని కొన్ని అనివార్య నిర్మాణాలు చేయాల్సి వస్తుంది. మరి అయితే వందశాతం వాస్తు ఎట్లా అనేది అందరికీ సందేహం. దీనికోసం పండితులు చెప్పేది ఒక్కటే ఎనిమిది దిక్కులలో కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే చాలు ఆ ఇంటికి వందశాతం వాస్తుగా పరిగణించవచ్చు. అవి ఏమిటో తెలుసుకుందాం…

ఈశాన్యం :

– ఈశాన్యం.. తూర్పు, ఉత్తరం కలిసే ప్రాంతం ఇది చాలా ముఖ్యమైన ప్రాంతం. ఈశాన్యం పెరుగవచ్చు. ఉత్తర ఈశాన్యం, తూర్పు వాశాన్యం కూడా పెరుగవచ్చు. ఈశాన్యం పెరగడం వలన లాభాలు వస్తాయి. ఈశానం పల్లంగా ఉండాలి. ఈశాన్యంలో గేటు, వీధిపోటు ఉండవచ్చు. సంపు, బోరు ఉండవచ్చు. ఈశాన్యం తగ్గకూడదు, బాల్కాని ఈశాన్యం తగ్గకూడదు, ఈశాన్యం సరిగా ఉంటే అన్ని శుభఫలితాలు వస్తాయి.

తూర్పు:

– తూర్పులో ఎక్కువ ఖాళీ ఉండాలి. దక్షిణం, పడమర కంటే ఎక్కువ స్థలం ఉండాలి. ఉత్తరం కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండాలి. తూర్పు మధ్య వీధిపోటు, మొత్తం స్థలానికి వీధిపోటు ఉండవచ్చు. తూర్పు మధ్యలో గేట్లు ఉండవచ్చు. తూర్పు మధ్యలో గొయ్యి, నుయ్యి, సెప్టిక్ లావెట్రీ ఉండవచ్చు. తూర్పు అన్ని దిక్కుల కంటే కొంచెం ఎక్కువ పల్లం ఉండాలి.

Vasthu Tips In Telugu

Vasthu Tips In Telugu

ఆగ్నేయం :

– తూర్పు, దక్షిణం కలిసే ప్రాంతాన్ని ఆగ్నేయం అంటారు. ఈ ఆగ్నేయంలో వంటగది ఉండాలి. ఆగ్నేయం పల్లంగా ఉండకూడదు, గొయ్చి నుయ్చి పనికిరాదు,. సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు. ఇంటి బయట ఆగ్నేయంలో బాత్రూం ఉండవచ్చు. మెట్టు ఉండవచ్చు. తూర్పు ఆగ్నేయం గేటు్ ఉండకూడదు, వీధిపోటు ఉండవచ్చు. కానీ దక్షిణ ఆగ్నేయంలో గేట్ ఉండవచ్చు. వీధిపోటు ఉండవచ్చు.

దక్షిణం :

– దక్షిణం వీధిపోటు పనికిరాదు, దక్షిణ ఆగ్నేయం గేటు పెట్టవచ్చు. దక్షిణ నైరుతి గేట్లు పనికిరావు. దక్షిణం అన్ని దిక్కుల కంటే కొంత ఎత్తు ఉండాలి.

నైరుతి :

– ఈ దిక్కు చాలా కీలకం. నైరుతి అంటే దక్షిణం- పడమర కలిసే ప్రాంతం. దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతిగా వర్గీకరించవచ్చు. ఈ ప్రాంతంలో కచ్చితంగా పాటించాల్సిన నియమాలు.. నైరుతిలో ఎట్టి పరిస్థితులలో గొయ్యి లేదా నుయ్యి ఉండకూడదు. తలుపులు, కిటీకీలు, ఉండకూడదు. టాయిలెట్స్ ఉండకూడదు, కిచెన్ ఉండకూడదు, వీధిపోట్లు ఉండకూడదు. మ్యాన్హోల్ కూడా ఉండకూడదు.

పడమర :

– గొయ్యి ఉండకూడదు, నుయ్యి ఉండకూడదు, ప్రహరి గోడ మంచిగా ఉండాలి. డ్రైనేజీ సంపు ఉండవచ్చు. పడమర వీధిపోటు వుండవచ్చు. ఉత్తరం, తూర్పు కంటే ఎత్తు ఉండాలి. తూర్పుకంటే తక్కువ ఖాళీ స్థలం ఉండాలి. పడమర మధ్యలో గేటు ఉండవచ్చు.

వాయువ్యం :

– ఉత్తరం, దక్షిణం కలిసే ప్రాంతం. ఈ ప్రాంతంలో గొయ్యి ఉండకూడదు, నుయ్యి ఉండకూడదు, సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు. మెట్లు ఉత్తర గోడపై ఉండకూడదు. ఉత్తర వాయువ్యం గేటు, వీధిపోటు ఉండకూడదు. పశ్చిమ వాయువ్యం వీధిపోటు ఉండవచ్చు. పడమర గేటు ఉండవచ్చు. పడమర వాయువ్యంపై మెట్లు, మూత ఉండకూడదు.

ఉత్తరం :

– దక్షణం, పడమర కంటే ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి. దక్షిణం, తూర్పు కంటే పల్లంగా ఉండాలి. తూర్పుతో సమానంగా లేదా తక్కువ పల్లం ఉన్నా మంచిదే. ఉత్తరం ప్రహరిగోడ తక్కువ ఎత్తులో ఉండాలి. ఉత్తరం మధ్య వీధిపోటు మంచిది. ఉత్తరం గేట్ ఉండవచ్చు. ఉత్తరం మధ్యలో సెప్టిక్ లావెట్రీ, సంపు ఉండవచ్చు. ఉత్తం మధ్యలో ద్వారాలు, కిటికీలు ఉండవచ్చు. ఉత్తర ఈశాన్యంలో కూడా గేట్ ఉండవచ్చు. బోర్, వాటర్ సంపు ఉండవచ్చు.

– మెట్లు తూర్పు ఆగ్నేయంలో, వాయువ్యంలో మెట్లు ఉండవచ్చు.

– ఆగ్నేయం, వాయువ్యం సమానంగా ఉంటే మంచిది.

– పైన చెప్పిన నియమాలను పాటిస్తే వందశాతం వాస్తు పాటించినట్లే. మీ జీవితం సుఖశాంతులతో ఉంటుంది.

– ఈ విషయాలు వాస్తుపట్ల నమ్మకం కలిగిన వారికి మాత్రమే. అయితే వాస్తు అనేది మూఢనమ్మకం కాదు. గాలి వెలుతురు ధారాళంగా రావడంతోపాటు ఇతర ప్రమాదాలు రాకుండా ఆపగలిగే సూత్రాలు.

= ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే దగ్గరలోని మంచి వాస్తు పండితున్ని సంప్రదించండి.

 

Advertisement
WhatsApp Group Join Now

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది