Sri Rama Navami : సీతారాముల కళ్యాణం నిజంగా ఎక్కడ జరిగిందో తెలుసా?
ప్రధానాంశాలు:
Sri Rama Navami : సీతారాముల కళ్యాణం నిజంగా ఎక్కడ జరిగిందో తెలుసా?
Sri Rama Navami : ఈ రోజు శ్రీరామనవమి Sri Rama Navami సందర్భంగా ఆలయాలు అన్ని కళకళలాడుతున్నాయి. భద్రాచలంలో రాముల వారి కళ్యాణం చూసేందుకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చారు. అయితే సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుండగా, అసలు సీతారాములు నిజంగా ఎక్కడ కల్యాణం చేసుకున్నారన్న విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. చారిత్రకంగా సీతారాముల వివాహం జరిగిన అసలు స్థలం భారతదేశం సరిహద్దులను దాటి నేపాల్‌లోని జనక్‌పూర్‌లో ఉందని పురాణాలు చెబుతున్నాయి.

Sri Rama Navami : సీతారాముల కళ్యాణం నిజంగా ఎక్కడ జరిగిందో తెలుసా?
Sri Rama Navami ఇది చరిత్ర..
రామాయణం ప్రకారం, అయోధ్యలో జన్మించిన శ్రీరాముడు , మిథిలా నగరంలో పుట్టిన సీతను వివాహం చేసుకున్నాడు. మిథిలా రాజ్యం, సీత జన్మస్థలం, ఆనాటి విదేహ రాజ్యంగా పిలువబడేది. జనకుడు, సీత తండ్రి, పాలించిన మిథిలా రాజధాని నేటి జనక్‌పూర్‌గా గుర్తించబడింది. ఇక్కడే భూమిని దున్నుతుండగా సీత ఉద్భవించినట్లు, ఆమె వివాహం రాముడితో జరిగినట్లు స్థానిక ఐతిహ్యాలు చెబుతాయి.
జనక్‌పూర్ లోని జానకీ మందిరం ఈ వివాహ స్థలానికి ప్రసిద్ధ చిహ్నం. 1910లో నేపాల్ రాణి వృషభాను నిర్మించిన ఈ ఆలయం వేల గజాల విస్తీర్ణంలో, 150 అడుగుల ఎత్తైన ప్రాకారం, పాలరాతి గోడలు, అద్దాల మేడలతో అద్భుతంగా నిలుస్తుంది. ప్రతి సంవత్సరం మార్గశిర శుక్ల పంచమి నాడు జనక్‌పూర్‌లో సీతారాముల కల్యాణం వైభవంగా జరుగుతుంది. ఈ రోజునే వారి వివాహం జరిగిందని స్థానికుల నమ్మకం.2018లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆలయాన్ని సందర్శించడంతో జనక్‌పూర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.