Meena Rashi : శుక్రుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశుల వారికి బంగారు బాతు దొరికినట్లే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Meena Rashi : శుక్రుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశుల వారికి బంగారు బాతు దొరికినట్లే…?

 Authored By ramu | The Telugu News | Updated on :22 February 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Meena Rashi : శుక్రుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు... ఇక ఈ రాశుల వారికి బంగారు బాతు దొరికినట్లే...?

Meena Rashi : జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో గ్రహాలలో కీలకమైన గ్రహం శుక్రుడు. ఈ శుక్రుడు జీవితంలో సంపదలను, సుఖాలను, ఐశ్వర్యాలను, సుఖమైన జీవితానికి మరియు విలాసాలకు కారకుడు. వ్యక్తి యొక్క జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే ఆ జాతకానికి ఎదురు లేదు. అయితే వచ్చే నెల ప్రారంభంలో శుక్రుడు తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. శుక్రుడు ఎప్పుడూ కదిలే విధంగా కాకుండా మీనరాశిలో తిరోగమన దిశలో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఈ ప్రభావం మొత్తం కూడా ద్వాదశ రాశుల పైన ఉన్న కానీ ప్రధానంగా మూడురాశుల వారికి మాత్రం అధిక ప్రభావం ఉండబోతుంది. అయితే రాబోయే నెల మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు మీన రాశిలోనే తిరోగమనంలో సంచారం చేయబోతున్నాడు శుక్రుడు. మరి ఈ శుక్ర మహాదశ ప్రారంభమైన ఈ రాశులు ఎవరో తెలుసుకుందాం….

Meena Rashi శుక్రుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇక ఈ రాశుల వారికి బంగారు బాతు దొరికినట్లే

Meena Rashi : శుక్రుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశుల వారికి బంగారు బాతు దొరికినట్లే…?

Meena Rashi ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి ఈ శుక్రవారం దశ ప్రారంభం అవ్వడం వల్ల జీవిత భాగస్వామితో ఇప్పటివరకు ఉన్న మనస్పర్ధలు అన్ని తొలగిపోయి, ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. వీరి జీవితంలో ఇక అన్ని సంతోషాలే. జీవిత భాగస్వామి యొక్క సలహా, పాటిస్తే పనుల్లో ఆర్థికంగా విజయాలు సాధిస్తారు. మీ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి కూడా ఇది శుభ సమయం. కుటుంబంలో వివాదాలన్నీ కూడా సర్దుమనుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు.

మీన రాశి : మీన రాశి వారికి శుక్ర మహాదశ ప్రారంభం కావడం చేత వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా మీన రాశి వారికి బాగా కలిసి వస్తుంది. మీరు పై స్థాయిలకు ఎదుగుతారు. మనకి ఏది అవసరమో అంతవరకే భగవంతుడు మనకి ఇస్తాడు. ఈ మీన రాశి వారు పని చేసే చోట పెద్ద పెద్ద విజయాలను అందుకుంటారు. ఎదుటివారు మీ వ్యక్తిత్వానికి ఆకర్షితులు అవుతారు. మీ మాట తీరు మరియు స్వభావం మృదువుగా ఉండాలి. మీన రాశి వారికి తిరుగులేదు ఇక. విక్రమహర్థశతో వీరు జీవితంలో స్థిరహస్తులను కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఏ శుక్రమహా దశ వలన అదృష్టం బలంగా పట్టుకుంది. మీరు ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. మీరు ఈ పెద్దల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు ఉన్నవారు ఈ సమయంలో వారికి అనుకూలంగా మారుతాయి. ఈ కర్కాటక రాశి వారికి శుక్రుడు లాభ స్థానంలో ఉండడం వలన వీరికి తిరుగులేదని చెప్పవచ్చు. ఈ స్థానంలోనే తిరోగమనము చేయనున్నాడు శుక్రుడు. సమయంలో కలిసి వచ్చిన ధనము నంతా కూడా జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. శివాలయంలో నవగ్రహాలకు ప్రదక్షణ, శుక్రునికి పూజలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది