karthika pournami : కార్తీక పౌర్ణమి వేడుకలు కెనడాలో ఘనంగా …. దేవాలయంనకు అధిక సంఖ్యలో తెలుగువారు ..
karthika pournami : మన భారత దేశంలోని సాంప్రదాయాలు , హిందువుల పూజలు ఏలా అయితే పాటిస్తామో .అలాగే విదేశాలలో కూడా సంప్రదాయాలను పాటిస్తారు అక్కడి హిందు ప్రజలు . అలాంటి విదేవాలలో ఒకటైన దేశం కెనడ . ఈ కెనడాలోని కాల్గారీలోకార్తీక పౌర్ణమి దీప వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు అక్కడి తెలుగువారు. శ్రీ అనఘా దత్త సాయిబాబబా ఆలయంలో భక్తులతో కళకళలాడింది. ఆ గుడిలో శివ పార్వతులకు మరియు సాయిబాబాకు అభిషేకంలు నిర్వహించినారు . నాలుగు వందల పైగా భక్తులు కార్తీక పౌర్ణమి సంధర్భంగా ఆ పూజలో పాల్గోన్నారు .
karthika pournami : కార్తీక పౌర్ణమి వేడుకలు కెనడాలో ఘనంగా

telugu people karthika pournami celebrations in canada united states
కార్తీక మాసం సందడంతా కెనడాలో కాల్గారీ ఆలయంలోనే ఉంది.శ్రీ అనఘా దత్త సాయిబాబబా ఆలయం సోసైటి అధ్వర్యంలో అక్కడి సాయిబాబా దేవాలయంలో కార్తీక కార్తిక దీప వేడుకులు అత్యంత వైభవంగా జరిగాయి . మన తెలుగువారు ఇతర దేశాలలో ఉన్నా మన సాంప్రదాయాలను మాత్రం మరచిపోలేదు .హిందు ధర్మాలను ,ఆచారాలను ,దేవుని పూజలను మరచిపోకుండా మన హిందు సాంప్రదాయాలకు విలవనిస్తున్నారు . అక్కడి తెలుగు ప్రజలకు కార్తీక పౌర్ణమి వేడుకలు భగవన్నామ స్మరణ కీర్తనలతో , దీప ,దూప నైవేద్యాలతో వేడుకలు కన్నుల పండుగలా సాగాయి .
అక్కడి దేవస్థానం అర్చకులు పండిట్ రాజ్ కూమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి . వెయ్యికి పైగా దీపాలు ,ఆత్సవ మూర్తులకు అభిషేకాతో ప్రారంభమైన వేడుకలు .మధ్యాన్నహరతి ,రుద్రహోమం,కార్తీక పౌర్ణమి సత్యనారాయణ వ్రతంతో పూర్తయ్యాయి.ఈ వేడుకలను చూచుటకు అక్కడి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ నిర్వాహుకులు లలిత ,శైలేష్ ల ఆధ్వర్యంలో జరిగిన ఆ వేడుకలకు ఎంతో మంది వాలంటీర్లు సహకరించారు .