Theertham : తీర్థాన్ని మూడు సార్లు ఎందుకు తీసుకుంటారు.. కారణం ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Theertham : తీర్థాన్ని మూడు సార్లు ఎందుకు తీసుకుంటారు.. కారణం ఏంటి?

 Authored By pavan | The Telugu News | Updated on :8 March 2022,5:00 pm

Theertham : హిందూ సంప్రదాయాల ప్రకారం హిందువులంతా పండుగలు, పబ్బాలు, ఇష్టమైన వారాల్లోనో లేదా పూజలు, వ్రతాలప్పుడు కచ్చితంగా గుడికి వెళ్తుంటారు. స్వామి వారి అనుగ్రహం పొందేందుకు కొబ్బరి కాయలు కొట్టడం, ప్రసాదాల సమర్పించడం మనకు తెలిసిన విషయమే. అయితే అక్కడ మనకు దేవుడుకి మధ్య అనుసంధాన కర్తగా పనిచేసే పూజారి తీర్థ ప్రసాదాలను అందజేసి మనల్ని ఆశీర్వదిస్తుంటాడు. అయితే మనం తీర్థం తీసుకునేటప్పుడు పూజారి మూడు సార్లు తీర్థం అందజేస్తారు. ఒకవేళ మనం ఒకసారి వేయగానే చేయి వెనక్కి తీసుకున్నా మూడు సార్లు తీసుకోవాలని పూజారి మనకు చెప్తుంటాడు. అయితే స్వామివారి తీర్థం మూడు సార్లు ఇవ్వడం వెనక గల కారణం ఏమిటి? తీర్థం తీసుకునేటప్పుడు ఎడమ చేతిలో కుడి చేయి పెట్టి తీర్థం ఎందుకు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు పురోహితులు అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర దుర్గావిష్ణు పాదోదకం పావనం అనే మంత్రాన్ని చెబుతూ తీర్ధాన్ని మూడు సార్లు భక్తులు చేతిలో వేస్తారు. అవి అకాల మరణాన్ని తప్పించే శక్తి, అన్ని రోగాల నివారణ, పాపక్షయం కనుక తీర్థాన్ని స్వీకరించి భక్తుడు స్వచ్ఛమైన మనసుతో దేవునిపై దృష్టి ఉంచి తీర్థాన్ని స్వీకరించాలని వేద పండితులు వివరిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల భక్తులకు శుభ ఫలితాలు కలుగుతాయట. అయితే మూడు సార్లు తీర్థం వేయడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే… మొదటి సారి తీర్థం తీసుకోవడం వల్ల మానసిక, శారీరక శుద్ధి జరుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. అదే విధంగా రెండవ సారి తీర్థం తీసుకోవడం వల్ల న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయట. అంతే కాకుండా మూడవ సారి తీర్థం స్వీకరించడం వల్ల పరమేశ్వరుడి కృప మనపై ఉంటుందట. పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింప చేసేదని అర్థం.

the secret behind giving Theertham three times

the secret behind giving Theertham three times

కాబట్టి ఆలయాన్ని సందర్శించిన భక్తులు ఈ విధంగా మూడు సార్లు తీర్థం తీసుకోవటం వల్ల భోజనం చేసినంత శక్తిని లభిస్తుందని మన పెద్దలు చెబుతుంటారు.అదే విధంగా తీర్థం తీసుకునే సమయంలో ప్రతి భక్తుడు ఎడమ చేతిలో కుడి చేయి పెట్టుకొని… కుడి చేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని సేవించడం వల్ల కళ్లు, బ్రహ్మ రంధ్రం, తల, మెడను తాకుతాయి. ప్రసాదం అనేది పృథ్వితత్వం అనే అంశంతో ముడిపడి ఉంటుంది. దీని వల్ల చైతన్యం, శక్తి కలుగుతాయి. అదే విధంగా తీర్ధం తీసుకున్న తర్వాత చాలా మంది చేతితో తలపై తాకుతుంటారు. కానీ ఇలా అస్సలే చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. ఎందుకంటే తలలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఎంగిలి చేయితో బ్రహ్మను తాకండ మహా పాపం. అందుకే తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని కళ్ళకు అద్దుకోవడం ఎంతో మంచిదని వివరిస్తున్నారు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది