Laxmi Devi : ఈ ఐదు మొక్కలు మీ ఇంట్లో ఉంటే.. లక్ష్మీదేవి మీ వెంటే..
Laxmi Devi : మన జీవనానికి మొక్కలే ఆధారం. మొక్కలు ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా, ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తాయి. ఇంట్లో కొన్ని మొక్కలు ఉండటం వల్ల ఏడాది పొడవునా ఐశ్వర్యం ఉంటుంది. మొక్కలు మనస్సును సైతం ప్రశాంతంగా ఉంచుతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తాయ్. ఈ మొక్కల ద్వారా పూచే పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే.. అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది. ఈ పుష్పాలతో పూజించడం వల్ల ఐశ్యర్యం లభిస్తుంది. శుభకార్యాలు చేపడితే ఎలాంటి ఆటంకం జరుగదు. మరి ఇంట్లో ఏ మొక్కలు నాటడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం వస్తుందో తెలుసుకుందాం.
మనీ ప్లాంట్ : మనీ ప్లాంట్ ఇంట్లో ఉండటం వల్ల డబ్బు నిలుస్తుందని విశ్వాసం. అయితే ఇది మనకు నేరుగా డబ్బులు ఇవ్వదు. మనీ ప్లాంట్ ఆక్సిజన్ ఎక్కువ విడుదల చేస్తుంది. ఆరోగ్యానికి కంటే ముఖ్యమైన ఆస్తి మనకు ఇంకేం కావాలి. అందుకే దీన్ని మనీప్లాంట్ అంటారు. మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో ఉంచడం మంచిది. ఈ దిశకు ఆధిదేవత వినాయకుడు కాగా ప్రతినిధి శుక్రుడు.
జేడ్ ప్లాంట్ : జేడ్ ప్లాంట్ ఇంటిలోని నెగటివ్ ఎనర్జీని బయటికి పంపుతాయి. ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించి కుటుంబంలో ఆనందాన్ని, మనశ్శాంతిని తెస్తాయి. ఫెంగ్ షుయ్ ప్రకారం.. క్రాసులా ఇంట్లోకి సంపదను ఆకర్షిస్తుంది.
లక్ష్మణ మొక్క: లక్ష్మణ మొక్క కూడా ధనలక్ష్మిని ఆకర్షించగలదు. ఇంట్లో కుండీలో దీనిని నాటుకోవచ్చు. అరటి చెట్టు.. అరటి చెట్టు ఇంట్లో ఉండటం మంచిది. బృహస్పతి కారకుడైనందున ఈశాన్యంలో ఈ చెట్టును నాటడం శుభప్రదం.
తులసి మొక్క : తులసిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా మనం కొలుస్తాం. ఇంట్లో తూర్పు లేదా ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటాలి. తులసి ఇంట్లోని అన్ని రకాల క్రిములను నాశనం చేస్తుంది. దీంతో ఇంట్లో ఆనందం, శాంతి, సౌభాగ్యం నెలకొంటాయి.
లక్కీ బాంబూ : లక్కీ బాంబూ మొక్క.. ఏ ఇంటిలో అయితే ఉంటుందో ఆ ఇంటిలో ఉన్న వారికి అదృష్టం వరిస్తుంది. ఈ మొక్కలు వెదురు జాతికి సంబంధించినవే. కాకపోతే ఇవి చిన్న వెదురు చెట్లు. ఈ చెట్లను మనము ఆఫీసులో ఇంటిలో టేబుల్ పైన ఉంచిన ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ చెట్టు ఉన్న ఇంటికి అదృష్టం వరిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ చెట్టును గుంపుగానే బిగించి ఉంచి ఎప్పుడు వీటి వేర్లను నీటిలోనే ఉంచాలి.