Gajalakshami Rajayoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారిపై దీని ప్రభావం ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కొన్ని ముఖ్యమైన గ్రహాలు సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. రాశులలో దేవగురువు అయినటువంటి బృహస్పతి ఏడాది మొత్తం ఒకే రాశీలో సంచరిస్తూ ఉంటాడు. అయితే ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. మరి కొద్ది రోజుల్లో వృషభ రాశి నుంచి మిధున రాశిలోకి ప్రవేశించనున్నారు. ఇక ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న బృహస్పతి మిధున రాశిలోకి ప్రవేశించడం వలన అత్యంత శక్తివంతమైన గజలక్ష్మి మహారాజ యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గజలక్ష్మి రాజయోగం అనేది దాదాపు 12 సంవత్సరాల క్రిందట ఏర్పడింది. అనంతరం 12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు 2025 సంవత్సరంలో శుక్రుడు మరియు బృహస్పతి సంయోగం కారణంగా గజలక్ష్మి మహారాజ యోగం ఏర్పడనుంది. ఇక ఈ గజలక్ష్మి మహారాజ యోగం అనేది హిందూ క్యాలెండర్ ప్రకారం మే 4 2025 సంవత్సరంలో ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం లభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సమయంలో ఈ రాశుల వారు అన్ని విధాలుగా అదృష్టాన్ని పొందుతారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శుక్రుడు మరియు బృహస్పతి కలయిక కారణంగా ఏర్పడే గజలక్ష్మి మహారాజ యోగంతో మిధున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇక ఈ సమయం వీరికి అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు. ఉద్యోగాల విషయంలో శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన ఆదాయ వనరులు చేతికి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు.
కర్కాటక రాశి : గజలక్ష్మి మహారాజయోగం కారణంగా కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో వీరికి పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉన్న సమస్యలన్నీ తొలగి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మతపరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి ఇది శుభ సమయం.
ధనుస్సు రాశి : గజలక్ష్మీ మహారాజయోగం కారణంగా ధనుస్సు రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకున్నవన్నీ ఈ సమయంలో సులభంగా సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపార రంగంలో పురోగతి సాధిస్తారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.