Zodiac Signs : శుక్రుడు బుధుడు సూర్యుడు కలయికతో ఈ రాశుల వారికి సంపదల వర్షం..!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ నెలలో బుధుడు శుక్రుడు సూర్యుడు తమ రాశులను మార్చుకుంటున్నారు. అయితే శుక్రుడు మాత్రం రెండుసార్లు తన రాశి మార్చుకోవడం వలన కొన్ని రాశుల వారికి సంపదను కలగజేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూడు గ్రహాల సంచారం వలన అదృష్టం పొందే రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Zodiac Signs డిసెంబర్ మాసంలో గ్రహాల సంచారం…
డిసెంబర్ 2వ తేదీన మకర రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ఇలా డిసెంబర్ 28వ తేదీ తరువాత శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా డిసెంబర్ 15వ తేదీన సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించగా అదే సమయంలో బుధుడు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. ఇక ఈ మూడు గ్రహాలు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి లబ్ధి చేకూరుతుంది.
Zodiac Signs వృషభ రాశి
డిసెంబర్ నెలలో బుధుడు శుక్రుడు సూర్యుడు గ్రహాల సంచారం వలన వృశ్చిక రాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఈ నెల అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది. ఈ సమయంలో వీరు ఏ పని తలపెట్టిన అందులో విజయం వర్తిస్తుంది. అలాగే సమాజంలో గౌరవం మర్యాదలు పెరగడంతో పాటు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇక వ్యాపారాల విషయానికొస్తే వ్యాపారంలో భారీ లాభాలను అందుకుంటారు. మొత్తం మీద వృషభ రాశి జాతకులకు ఈనెల అదృష్ట సమయం అనేది చెప్పుకోవచ్చు.
సింహరాశి : డిసెంబర్ నెలలో మూడు గ్రహాల సంచారం కారణంగా సింహరాశి జాతకులకు భారీ లాభాలు వస్తాయి. అలాగే ఆకస్మిత ధన లాభం ఉంటుంది. ఇక ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అలాగే పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. సింహరాశి జాతకుల జీవిత భాగస్వామి మధ్య సంబంధాలు బలపడతాయి.
మకర రాశి : డిసెంబర్ నెలలో శుక్రుడు బుధుడు రవి గ్రహాల కారణంగా మకర రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఇక వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితం బాగుంటుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందుకుంటారు. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. మకర రాశి జాతకులలో పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మొత్తం మీద మకర రాశి జాతకులకు అదృష్ట సమయం అని చెప్పుకోవచ్చు.