Zodiac Signs : శని ప్రభావంతో మహార్జాతకులుగా మారనున్న 3 రాశులు… 2027 వరకు తిరిగే లేదు…!
ప్రధానాంశాలు:
Zodiac Signs : శని ప్రభావంతో మహార్జాతకులుగా మారనున్న 3 రాశులు... 2027 వరకు తిరిగే లేదు...!
Zodiac Signs : నవగ్రహాలలో శనిదేవునికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మనం చేసే మంచి చెడులను వర్గీకరించి చేసే కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడు కాబట్టి శనిదేవుని కర్మదేవుడు అని కూడా పిలుస్తారు. అయితే క్రమశిక్షణకు మారుపేరుగా న్యాయదేవతకు ప్రతికగా పిలవబడే శని దేవుడు చాలా నిదానంగా ప్రయాణిస్తారు. అందుకే శని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరించడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల తర్వాత శని తన సొంత రాశి అయినటువంటి కుంభ రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలోనే 2025లో తన స్థానాన్ని మార్చుకుని మీన రాశిలోకి ప్రవేశిస్తాడు . అయితే మీనరాశిలో శని సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి 2027 వరకు అదృష్టం పడుతుందని చెప్పవచ్చు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Zodiac Signs : వృషభ రాశి
2025 సంవత్సరం వృషభ రాశి వారికి అన్ని విధాలుగా కలిసివస్తుంది. అలాగే మీన రాశిలో శని సంచారం కారణంగా ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. పదోన్నతులు పొందుతారు.ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది.
కన్య రాశి : మీనరాశిలో శని సంచారం కారణంగా కన్య రాశి వారికి 2025 సంవత్సరం శుభయోగాలను అందిస్తుంది. ఇక ఈ సమయంలో వీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పురోగతి లభిస్తుంది. దీంతో దాదాపు 2027 వరకు ఈ రాశి వారికి అదృష్టం పడుతుంది.
మకర రాశి : మీనరాశిలో శనిసంచారం కారణంగా 2027 వరకు మకర రాశి వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో వీరికి డబ్బు లోటు ఉండదు . ఆర్థికంగా బలపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.