Shri Krishna Janmashtami : సెప్టెంబర్ 7 శ్రీకృష్ణ జన్మాష్టమి. కొడుకులు ఉన్నవారు సాయంత్రం 4 గంటల 14 నిమిషాల లోపు ఈ పరిహారం చేసి తీరాల్సిందే…
Shri Krishna Janmashtami : కృష్ణాష్టమి పూజ విధానం. పూజ ఎవరు చేసుకోవాలి? నైవేద్యాలు ఎలా పెట్టాలి.. చిన్ని కృష్ణయ్య పాదాలు ఎందుకు వేస్తారు.. ఇలాంటి ఎన్నో విశేషాలు మనం తెలుసుకుందాం.. కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టిన రోజు అనంత ఘనంగా నిర్వహించుకుంటాం.. ఇంతకీ ఆరోజు కృష్ణుని పూజ ఎలా చేసుకోవాలి. అనే విశేషాలు మనం తెలుసుకుందాం.. శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్ర లేచి అభ్యంగ స్నానం చేయాలి. గుమ్మానికి తోరణాలు గడపకు పసుపు కుంకుమలు పూజా గదిలో ముగ్గులు అది పూజకు సిద్ధం కావాలి. ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలి వరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి.
ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం వీలైతే ఆ సమయానికి పూజ సాగేలా చేసుకోవాలి. పప్పు పానకం పళ్ళు వంటి నివేదనలు సాధారణంగా మనం పెడుతూనే ఉంటాం. వీటితో పాటు ఆయనకి ఇష్టమైన పాలు వెన్న మీగడను కూడా ప్రసాదంగా సమర్పించాలి. మరికొందరు బాలింతలకు పెట్టే మినప పిండి పంచదార కలిపి కృష్ణుడికి నైవేద్యంగా పెడతారు. కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలై ఉండవచ్చు.. చలి కాలానికి శరీరాన్ని సిద్ధం చేయడం కూడా ఈ ప్రసాదం వెనుక పరమార్థం కనిపిస్తుంది. లేకపోతే కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే.
అలా కృష్ణుని తలుస్తూ కొలుస్తూ పూజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రాత్రి వెళ కృష్ణ పూజ చేస్తారు. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణమాసంలోని కృష్ణపక్షంలో అష్టమి నాడు అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆ దేవుని జన్మదినాన్ని పురస్కరించుకుని మనమందరం కూడా శ్రీకృష్ణుని వేషధారణలో చిన్న పిల్లల్ని తయారు చేసి జన్మాష్టమి రోజు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్న శ్రీకృష్ణుడికి చిన్నతనంలో పెరుగు వెన్న అంటే చాలా ఇష్టం తను నిత్యం గోపికల ఇళ్లలోని గుండెల్లో దాచుకున్న వెన్నను దొంగలించి తినేవాడు.
ఆ సమయంలో గోపికలు తమ బాధను యశోదతో మొరపెట్టుకునేవారు. అయినా ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు.. ఈ మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే శ్రీకృష్ణాష్టమి రోజు పెరుగు వెన్న నైవేద్యంగా ఎవరైతే పెడతారో వారికి ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాడు.