Shri Krishna Janmashtami 2025 : శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున… పూజా శుభముహూర్తం… పూజా విధానం పూజ సామాగ్రి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shri Krishna Janmashtami 2025 : శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున… పూజా శుభముహూర్తం… పూజా విధానం పూజ సామాగ్రి…?

 Authored By aruna | The Telugu News | Updated on :16 August 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  shri krishna janmashtami 2025 : శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున...పూజా శుభముహూర్తం... పూజా విధానం పూజ సామాగ్రి...?

shri krishna janmashtami 2025 : శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ ఈ సంవత్సరం 2025 ఆగస్టు 16న దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. జన్మాష్టమిని కృష్ణాష్టమి,గోకులాష్టమి, అష్టమి, రోహిణి,శ్రీకృష్ణ జయంతి,జన్మాష్టమి, శ్రీ జయంతి వంటి పేర్లతో కూడా పిలుస్తారు.ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్య అనుగ్రహం కోసం పూజ శుభ సమయం ఎప్పుడు పూజ సామాగ్రి తదితర వివరాలు గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసంలో కృష్టపక్షంలోని అష్టమి తిథి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు. అందుకే ఈరోజున శ్రీకృష్ణ జన్మాష్టమని పిలుస్తారు. దేవకీనందులకు అర్ధరాత్రి అష్టమి తిథి రోజున రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. అందుకే శ్రీకృష్ణ జన్మాష్టమిని నిర్ణయించడం అష్టమి తిధినా చాలా ప్రాముఖ్యతగా వస్తుంది. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడి బాలరూపాన్ని పూజిస్తారు. శ్రీకృష్ణుని బాలరూపాన్ని లడ్డు గోపాల అని బాలగోపాలుడు అని పిలుస్తారు.ఈ ఏడాది ఆగస్టు 16న అంటే రేపు దేశవ్యాప్తంగా కృష్ణ జన్మాష్టమి పండుగ జరుపుకుంటారు.

Shri Krishna Janmashtami 2025 శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున పూజా శుభముహూర్తం పూజా విధానం పూజ సామాగ్రి

Shri Krishna Janmashtami 2025 : శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున… పూజా శుభముహూర్తం… పూజా విధానం పూజ సామాగ్రి…?

శ్రీ కృష్ణ జన్మాష్టమి అష్టమి తిధి ఆగస్టు 15న అంటే ఈ రాత్రి 11:49 గంటలకు ప్రారంభం అవుతుంది ఇది ఆగస్టు 16న రాత్రి 9:34 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం ఈసారి కృష్ణ అష్టమి ఆగస్టు 16న జరుపుకుంటారు శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి రోహిణి నక్షత్రం ఒకరోజు సంభవించడం లేదు ఈ సంవత్సరం రోహిణి నక్షత్రం ఆగస్టు 3 :17న ఉదయం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నుంచి ఆగస్టు 18న తెల్లవారుజామున 3: 17 వరకు ఉంటుంది.

కృష్ణ జన్మాష్టమి పూజ ముహూర్తం

జన్మాష్టమి పూజ ముహూర్తం ఆగస్టు 17న తెల్లవారుజామున 12 :04 నుంచి 12: 47 వరకు ఉంటుంది. దీనికి మొత్తం 43 నిమిషాల లో అందుబాటులో ఉంటాయి అదే సమయంలో జన్మాష్టమి ముగింపు ఆగస్టు 17న ఉదయం 5:51 గంటల తర్వాత మాత్రమే జరుగుతుంది.

కృష్ణ జన్మాష్టమి పూజా విధి

అష్టమి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి. ఆ తర్వాత శ్రీకృష్ణుని బాల రూపాన్ని అలంకరించి,ఆయనను నియమాలతో పూజించండి. బాలకృష్ణుని ఊయలలో కూర్చోబెట్టి పాలు గంగాజలంతో అభిషేకించండి. కొత్త బట్టలు,కిరీటం, వేణువు, వైజయంతి హారంతో అలంకరించండి. తులసీదానాలు, పండ్లు, వెన్న, చక్కెర,మిఠాయి ఇతర ప్రసాదాలను భోగభాగ్యాలలో సమర్పించండి. చివరగా హారతి ఇచ్చి అందరికీ ప్రసాదాన్ని పంపిణీ చేయండి.

జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుని పూజకు అవసరమైన సామాగ్రి

ఊయల, శ్రీకృష్ణుని విగ్రహం, లేదా చిత్రపటం, వేణువు,ఆభరణాలు, కిరీటం,తులసీదళాలు, గంధం, అక్షంతం,వెన్న,కుంకుమ, యాలకులు,ఇతర పూజ సామాగ్రి, కలశం,గంగాజలం,పసుపు, తమలపాకు,సింహాసనం, బట్టలు, కుంకుమ,కొబ్బరికాయ,మౌళి, సుగంధ ద్రవ్యాలు, నాణేలు, ధూపం, దీపం, అగర్బత్తి,పండ్లు, కర్పూరం,నెమలి,ఈ వస్తువులన్నీ శ్రీకృష్ణుని పూజ అలంకరణ కోసం ఉపయోగిస్తారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది