Kumbha Rasi : త్వరలోనే కుంభరాశిలోకి రానున్న రాహువు… ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!
Kumbha Rasi : ఛాయాగ్రహం.. నవగ్రహాలలో దీనిని చెడు గ్రహంగా భావిస్తారు. అయితే రాహువు ఏ రాశిలోకి సంచరించిన అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. ఈ రాహు సంచారం కొంతమందికి శుభాన్ని కలిగిస్తుంది. మరి కొంతమందికి అష్ట కష్టాలను పెడుతుంది. అయితే ఈ రాశి ముందునుంచి వెనక్కిి సంచరించడంతో మేష రాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ రాహుకి గురువు అధిపతి అయిన మీనరాశిలో సంచరిస్తుంది. అలాగే వచ్చే ఏడాది […]
ప్రధానాంశాలు:
Kumbha Rasi : త్వరలోనే కుంభరాశిలోకి రానున్న రాహువు... ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం...!
Kumbha Rasi : ఛాయాగ్రహం.. నవగ్రహాలలో దీనిని చెడు గ్రహంగా భావిస్తారు. అయితే రాహువు ఏ రాశిలోకి సంచరించిన అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. ఈ రాహు సంచారం కొంతమందికి శుభాన్ని కలిగిస్తుంది. మరి కొంతమందికి అష్ట కష్టాలను పెడుతుంది. అయితే ఈ రాశి ముందునుంచి వెనక్కిి సంచరించడంతో మేష రాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ రాహుకి గురువు అధిపతి అయిన మీనరాశిలో సంచరిస్తుంది. అలాగే వచ్చే ఏడాది కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. అలా ఈ రాహువు 2026వ సంవత్సరం వరకు కుంభరాశిలో సంచరిస్తాడు. ఇక కుంభ రాశికి అధిపతి శనీశ్వరుడు కావడంతో కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇక దీనితో వారు అధిక లాభాలను పొందుతారట. మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Kumbha Rasi : మేషరాశి
రాహు కుంభరాశిలో సంచరించడం వలన ఈ రాశి వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అన్ని విషయాల్లో వీరికి శుభం కలుగుతుంది. అలాగే వ్యాపారులకు సమస్యలు తొలగిపోతాయి. లాభాలను అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఇది శుభ సమయం అని చెప్పుకోవాలి. అదేవిధంగా పెట్టుబడులను పెట్టిన వారు అధిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఇది వారికి శుభ సమయం. విజయాలను పొందుతారు అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి.
Kumbha Rasi కుంభరాశి
రాహువు సంచారంతో ఈ రాశి వారికి మేలు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరికి ఇప్పటివరకు ఉన్న సమస్యలు అన్ని తొలగిపోతాయి. అలాగే కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనులలో విజయలను సాధిస్తారు. ఈ రాశి దంపతుల మధ్య ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే గనక అవి పరిష్కార మార్గంగా అడుగులు వేస్తారు. విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చక్కబడుతుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అదృష్ట కాలం నడుస్తుంది.
మకర రాశి
కుంభ రాశిలోకి రాహు సంచారం వలన ఈ రాశి వారికి మేలు జరుగుతుంది. మీరు ఏ పని చేసిన అది విజయవంతంగా పూర్తి అవుతుంది. అలాగే వీరు లాభాలను పొందుతారు. వ్యాపారులకు మరియు ఉద్యోగులకు కలిసి వస్తుంది. ఏ పనైనా కష్టపడకుండా సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈ ఏడాది శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో ఆహ్లాదకరంగా ఉంటుంది. వీరికి స్నేహితుల నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.