Lakshmi Devi : కొబ్బరికాయతో ప్రత్యేకమైన ప్రయోజనాలు… లక్ష్మీదేవి ప్రసన్నంతో అన్ని దరిద్రాలు తొలగిపోతాయి…!!
Lakshmi Devi : మనం ఇంట్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ కొబ్బరికాయను దేవుడికి సమర్పిస్తూ ఉంటాం. అయితే ఈ కొబ్బరికాయ లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమని అందుకే కొబ్బరికాయ కొట్టడం వల్ల జీవితంలో వచ్చే దరిద్రాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రజలు శ్రీమహావిష్ణు లక్ష్మీదేవిని ఎన్నో రకాలుగా ఆరాధిస్తూ ఉంటారు. దానధర్మాలు తపస్సు, నామస్మరణతో పాటు గంగా స్నానం కూడా చేస్తూ ఉంటారు. అయితే టెంకాయలో త్రిమూర్తులు ఉంటారని చెప్తుంటారు. కావున దాన్ని ప్రతి శుభకార్యంలో వాడుతూ ఉంటారు. లక్ష్మీదేవి కొబ్బరికాయకి అంటే చాలా ప్రీతకరం.
కావున టెంకాయ కొట్టడం వల్ల ధనం సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు వీలుంటే కొబ్బరి చెట్టును ఇంట్లో నాటండి. దానివలన ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే రుణ బాధ నుంచి బయటపడతారు. గృహానికి దక్షిణం లేదా పడమర దిశలో ఈ కొబ్బరి చెట్టుని నాటినట్లయితే అంతా మేలు జరుగుతుంది.. ఒకవేళ జాతకంలో రాహు, కేతు దోషాలు గనక ఉంటే ఈ కొబ్బరి కాయ చిట్కా ద్వారా దానిని పోగొట్టుకోవచ్చు. శనివారం నాడు కొబ్బరికాయలు రెండు భాగాలుగా చేసి దానిలో పంచదార పోయాలి. దాని తర్వాత దాని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టాలి. భూమి పై నివసించే కీటకాలు వాటిని తినడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
టెంకాయ సహాయంతో ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను కూడా తొలగించుకోవచ్చు. టెంకాయ పిలకను తీసి ఇంట్లోని ప్రతి మూలలో వేసిన తర్వాత ప్రవహిస్తున్న నీటిలో దీనిని పడేవేయాలి. ఈ విధంగా చేయడం వలన ఇంట్లో దుష్ప్రభావం పోయి కుటుంబ సభ్యులలో ప్రేమ అనుబంధాలు పెరుగుతాయి. మీ చేతిలో ధనం లేకపోతే శుక్రవారం నాడు తలస్నానం చేసి ఎర్రని వస్త్రాలను ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. ఆ తర్వాత కొబ్బరికాయ తామర పువ్వు ,తెల్లని వస్త్రాలు, పెరుగు మరియు తెల్లని స్వీట్లు లక్ష్మీదేవికి సమర్పించుకోవాలి. సమర్పించిన టెంకాయను ఎర్రటి గుడ్డలో చుట్టి ఎవరి చూడని ప్రదేశంలో పెట్టాలి. ఈ విధంగా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి.