Tirupati Mystery Story : తిరుపతి మిస్టరీ ఏంటి? తిరుమలలో వేంకటేశ్వర స్వామి ఎలా వెలిశాడు? ఎవరు ఆ ఆలయాన్ని నిర్మించారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tirupati Mystery Story : తిరుపతి మిస్టరీ ఏంటి? తిరుమలలో వేంకటేశ్వర స్వామి ఎలా వెలిశాడు? ఎవరు ఆ ఆలయాన్ని నిర్మించారు?

 Authored By prabhas | The Telugu News | Updated on :23 July 2022,1:00 pm

Tirupati Mystery Story : తిరుపతి గురించి తెలియని వాళ్లు ఎవ్వరూ ఉండరు. మన దేశంలో ఎన్నో గుడులు, గోపురాలు ఉన్నప్పటికీ తిరుపతికి ఉన్న ప్రత్యేకతే వేరు. అందుకే జీవితంలో ఒక్కసారి అయినా సరే తిరుపతిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. తిరుమలను దర్శించుకుంటే తమ జన్మ ధన్యం అయింది అని అనుకుంటారు. అయితే.. తిరుపతి గురించి చాలామందికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అసలు.. తిరుపతి విశిష్టత ఏంటి? తిరుమలలో వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిశాడా? మహా విష్ణువే వెంకటేశ్వర స్వామి రూపంలో తిరుపతిలో వెలిశాడా? రెండో భార్యగా స్వామి వారు పద్మావతిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చాలా మంది భక్తులు అత్యంత విలువైన కానుకలు, తలనీలాలు సమర్పించడం వెనుక రహస్యం ఏంటి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన, చరిత్రకు సంబంధించిన వీడియోలు కావాలంటే ఈ చానెల్ ను ఫాలో అవండి.

ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. కలియుగ ప్రారంభ సమయంలో త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడిలో ఎవరికి అగ్రస్థానం ఇవ్వాలి అనేదానిపై చర్చ జరుగుతుంది. అప్పుడు ముగ్గురిలో ఎవరు గొప్పవారు అని నిర్ణయించడానికి రుషులలో గొప్పవాడు అయిన బ్రుగు మహర్షి ముందుగా కైలాసానికి వెళ్లాడు. అక్కడ పరమశివుడు పార్వతి దేవితో నాట్యం ఆడుతూ మహర్షిని పట్టించుకోలేదు. దీంతో బ్రుగు మహర్షి.. ఈ క్షణం నుంచి మానవులు నిన్ను లింగ రూపంలోనే పూజిస్తారు అని శపించి బ్రహ్మ లోకానికి వెళ్లాడు. అక్కడ బ్రహ్మ దేవుడు.. తన భార్య సరస్వతి దేవి వాయిస్తున్న వీణ సంగీతాన్ని వింటూ బ్రుగు మహర్షి గురించి పట్టించుకోలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన బ్రుగు మహర్షి.. ఈ క్షణం నుంచి నీకు భూలోకంలో ఒక్క దేవాలయం కూడా ఉండదు. మానవులెవ్వరూ నీకు కనీసం పూజ కూడా చేయరు అని శపిస్తాడు.

Unknown Facts About Tirupati Mystery Story

Unknown Facts About Tirupati Mystery Story

అందువల్ల బ్రహ్మ దేవాలయాలు భూలోకంలో కనబడవు. చివరకు విష్ణువు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు శ్రీమహా విష్ణువు లక్ష్మీదేవి ఒడిలో సేద తీరుతూ బ్రుగు మహర్షిని పట్టించుకోలేదు. దీంతో తన కుడికాలితో విష్ణు మూర్తి చాతిపై బలంగా తన్నాడు. కారణం.. బ్రుగు మహర్షి కుడి కాలు కింద జ్ఞాన నేత్రం ఉంటుంది. అందువల్లనే అతడికి అంతలా గర్వం ఉంటుంది. అప్పుడు శ్రీ మహా విష్ణువు స్వామీ నన్ను క్షమించండి. మీ రాకను గమనించకపోవడం నా తప్పే. అందుకు ప్రాయశ్చిత్తంగా మీ పాదసేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి అని మహర్షి కాళ్లు పట్టుకుంటాడు.అలా కాళ్లు నొక్కుతూ అతడిని కుడి కాలి కింద ఉన్న జ్ఞాన నేత్రాన్ని తన బొటన వేలుతో చిదిమేశాడు. దీంతో బ్రుగు మహర్షి గర్వం పోతుంది. తన తప్పు తెలుసుకున్న బ్రుగు మహర్షి క్షమించమని విష్ణువును వేడుకుంటాడు. అప్పుడు అతడిని క్షమించి వదిలేస్తాడు. ఇదంతా గమనించిన లక్ష్మీదేవి.. నిన్ను తన్నిన మహర్షిని క్షమిస్తావా?

అతడికి పాద సేవ చేస్తావా అని విష్ణువును వదిలేసి వెళ్లిపోతుంది. ఆమె కోసం ముల్లోకాలను వెతుకుతాడు.
అప్పుడు నారదుడు ప్రత్యక్షం అయి లక్ష్మీ దేవి భూలోకంలో నివాసం ఉంటోందని సమాచారం ఇవ్వడంతో విష్ణువు.. శ్రీనివాసుడిగా మారి.. లక్ష్మీ దేవి కోసం భూలోకానికి వచ్చాడు. మానవుడిగా కిందికి రావడం వల్ల ఆకలితో స్పృహ తప్పి పడిపోతాడు. ఆయన్ను గమనించిన చీమలు.. అతడికి ఎండ తగలకుండా పుట్టలు పెడతాయి. ఈ విషయాన్ని లక్ష్మీదేవికి చేరవేస్తాడు నారదుడు.తన భర్తను కాపాడాలని బ్రహ్మ, శివుడిని వేడుకుంటుంది. శివుడు, బ్రహ్మ దేవుడు ఆవు, లేగదూడగా మారిపోతారు. ఆవు పుట్టలో పాలు విడవడాన్ని గమనించిన కాపరి దాని మీదికి గొడ్డలి విసురుతాడు. అప్పుడు శ్రీనివాసుడు ఆవుకు అడ్డుగా నిలిచుంటాడు. దీంతో గొడ్డలి శ్రీనివాసుడి నుదుట తాకుతుంది. రక్తం కారుతుంది. అక్కడ ఉన్న వెంట్రుకలు చర్మంతో సహా ఊడి కిందపడిపోయాయి.

మళ్లీ లక్ష్మీదేవిని వెతుకుతూ శ్రీనివాసుడు వెళ్తాడు. అలసిపోయి ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా అటువైపు వెళ్తున్న నీలాదేవి ఆయన్ను గమనిస్తుంది. ఇంత అందగాడికి జుట్టు లేకపోవడం ఏంటి అని తన జుట్టును కొంత తీసి శ్రీనివాసుడికి అందిస్తుంది. దీంతో శ్రీనివాసుడు మేల్కొని నీవు ఒక స్త్రీ మూర్తివి అయి ఉండి కూడా నీ నీలాలను నాకు అర్పించావు. ఇక నుంచి నా భక్తులు నీకు నీలాలను అర్పిస్తారు అని వరం ఇస్తాడు. అందువల్ల తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులు తమ తలనీలాలను అర్పిస్తుంటారు. లక్ష్మీని వెతుకుతూ వకుల అనే ఓ వృద్ధురాలు ఇంటికి వెళ్తాడు. పద్మావతిని శ్రీనివాసుడికి ఇచ్చి పెళ్లి చేసేలా వకులే ఆకాశరాజును ఒప్పిస్తుంది.

పద్మావతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి అక్కడికి వెళ్తుంది. అప్పుడే పద్మావతితో ఏడు అడుగులు వేసిన ముందుకు వేసిన తర్వాత తనను చూసి ఏడు అడుగులు వెనక్కి వేసి 11 అడుగుల శిలగా మారిపోతాడు. దీంతో లక్ష్మీదేవి, పద్మావతి కూడా శిలగా మారిపోతారు. వీళ్ల విగ్రహాలు మొదటి సారిగా శేషాచలం అడవుల్లోని చీమలకొండ లోపల కొంతమంది ఆవుల కాపర్లు కనుగొని తమ రాజుకు చెప్పడంతో శ్రీనివాసుడికి ఆలయం కట్టిస్తాడు. ఆ ఆలయమే ఇప్పుడు తిరుమలలో ఉన్న వేంకటేశ్వర స్వామి గుడి. ఈ వీడియో మీకు ఎంతో కొంత సమాచారాన్ని అందించిందని మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ఈ చానెల్ లో మీకోసం త్వరలో అందిస్తాం.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది