Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం… ఇంటిని ఎలాంటి సందర్భంలో వదిలిపెట్టాలో తెలుసా…?
ప్రధానాంశాలు:
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం... ఇంటిని ఎలాంటి సందర్భంలో వదిలిపెట్టాలో తెలుసా...?
Vastu Tips : చాలామందికి కూడా ఒక గృహం ని నిర్మించుకోవాలని కలలు కంటూ ఉంటారు. నెరవేరినప్పుడు ఎంతో ఆనందంతో ఎగిరి గంతేస్తారు. ఎలాంటి లోపాలు లేకుండా ఇల్లు నిర్మించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటూ వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. కొందరు ఇవేమి పట్టించుకోకుండా ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. తద్వారా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. మీరు మీ ఇంటిలో నివసిస్తున్న క్రమంలో కొన్ని సంకేతాలు కనిపిస్తే ఆ ఇంటిని విడిచిపెట్టడమే మేలు అంటారు కొందరు పండితులు.కానీ అది ఎందుకో తెలుసుకుందాం…

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం… ఇంటిని ఎలాంటి సందర్భంలో వదిలిపెట్టాలో తెలుసా…?
Vastu Tips వాస్తు శాస్త్రం ప్రకారం
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని సంకేతాలు అశుభకరమైనవి. ఇలాంటి సమయంలో వీటిని గుర్తించి తగు పరిహారాలు చేయడమే,లేదా తప్పనిసరిగా ఇంటిని వదిలేయటం వంటివి చేయడం మంచిదట. లేకపోతే ఆ ఇంటిలో నివసించేవారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా ఆ సంకేతాలు కూడా ఏమై ఉంటాయో తెలుసుకుందాం…
ఇలాంటి ఇంట్లో నివసిస్తే అశుభం : ఏ ఇంట్లో అయితే సరిగ్గా సూర్యరశ్మి పడదో, ఆ ఇంట్లో అస్సలే ఉండకూడదట. దీనివలన ఆ ఇంట్లో ఎప్పుడు అనారోగ్య సమస్యలు,కలహాలు వస్తూనే ఉంటాయట. కాబట్టి సూర్య రష్మీ, సూర్యకిరణాలు ఇంటిలో పడితే ఆ ఇంటికి శుభం జరుగుతుంది. ఇంట్లో అయితే సూర్యకిరణాలు పడవో ఆ ఇల్లు వదిలిపెట్టడం మంచిదంటున్నారు వాస్తు నిపుణులు. ఎవరింట్లో అయితే అది కూడా గాలి కూడా చొరబడనంత వెంటిలేషన్ లేకపోయినా, ఇంకా ఏ ఇంట్లో ఎక్కువగా బూజు ఉంటుందో, అలాంటి ఇంట్లో నివాసం ఉండడం మంచిది కాదంట. కొంతమంది వారానికి ఒకసారి బూజు తీసినా మళ్లీ ఆ ఇంట్లో భూజు వస్తూనే ఉంటుంది. అలాంటి ఇంట్లో ఉండకూడదని చెబుతారు వాస్తు పండితులు.
దారుణంగా ఇంట్లో బల్లులు ఉండడం, సహజమే కానీ ఎవరింట్లో అయితే ఎక్కువ బల్లులు ముఖ్యంగా 10 కంటే ఎక్కువ సంఖ్యలో బల్లులు తిరుగుతాయో, ఆ ఇంట్లో నివసించడం మంచిది కాదంట. చెదలు ఎక్కువగా ఉన్న ఇంటిలో ఎక్కువ రోజులు నివసించకూడదు. ఇక ఏ భూమిలో అయితే సహజ సిద్ధంగా బొగ్గు పండుతుంది. అలాగే ఎవరైనా ఇంటి నిర్మాణం కోసం పునాది తీసినప్పుడు ఎముకలు కనిపిస్తాయో, ఆ భూమిలో ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు నిర్మించకూడదు. అలాగే భయంకరమైన నల్ల చెట్టు పెరిగే చోట కూడా ఇంటి నిర్మాణం చేయకూడదట.