Vastu Tips : ఈ పిల్లి ఇంట్లో ఉంటే ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vastu Tips : ఈ పిల్లి ఇంట్లో ఉంటే ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసా…?

 Authored By aruna | The Telugu News | Updated on :16 September 2022,6:00 am

Vastu Tips : ప్రతి ఇంటికి వాస్తు అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు వాస్తుకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఫెంగ్ షుయ్ అని పిలువబడే ఒక ప్రత్యేక వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం. చైనీస్ వాస్తు శాస్త్రం ఫెంగ్ షుయ్. ఈ వాస్తుకి ఫెంగ్ షుయ్ పిల్లి ప్రసిద్ధి. ఫెంగ్ షుయ్ లో కూడా జీవితంలో ఆనందం శ్రేయస్సు ఆర్థిక సంపదలకు సంబంధించిన కోరికలను నెరవేర్చడానికి అనేక నివారణలు ప్రస్తావించారు. ఈరోజుల్లో భారతీయ మార్కెట్లో అనేక ఫెంగ్ షుయ్ సంబంధించిన గాడ్జెట్ లు, షోపీస్ లు ఉన్నాయి. ఇది ఇంటి వాస్తును మెరుగుపరుస్తాయి. ఇంట్లోనే దరిద్రాన్ని దూరం చేస్తాయి.

ఫెంగ్ షుయ్ లో పేర్కొన్న ఈ వస్తువులు చాలా సానుకూల శక్తిని కలిగి ఉన్నాయని నమ్ముతారు. వాటిని సరిగ్గా వినియోగిస్తే అవి మీ జీవితాన్ని సంతోషపరుస్తాయి. ఫెంగ్ షుయ్ పిల్లులను అదృష్టానికి ప్రతీకగా పరిగణిస్తారు. ఈ పిల్లి వేరు వేరు రంగులను కలిగి ఉంటుంది. వివిధ రంగులు వేరు వేరు ప్రభావాలను కలిగి ఉంటాయి. బంగారు రంగు పిల్లిని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఫెంగ్ షుయ్ పిల్లిని కొనుగోలు చేయవచ్చు. ఇంటికి ఈశాన్యం దిక్కులో పచ్చని పిల్లిని ఉంచడం అదృష్టంగా భావిస్తారు. జీవితంలో ప్రేమ సరిగా లేకపోతే ఇంటికి నైరుతి దిశలో ఎరుపు రంగు పిల్లిని ఉంచుకోవచ్చు.

Vastu Tips for Cat In home problems

Vastu Tips for Cat In home problems

బంగారు పసుపు రంగు పిల్లి ఉంచుకోవడం వలన వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. సంపద కోసం కుబేరుని దిక్కులో ఆగ్నేయంలో నీలం పిల్లిని ఉంచితే శుభం జరుగుతుంది. విజయంతో పాటు ధనం కూడా లభిస్తుంది. ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు అదృష్టం ఉండాలంటే ఆకుపచ్చ రంగు పిల్లిని ఈశాన్య దిక్కున ఉంచాలి. దీంతో ఇంట్లోకి సానుకూల
శక్తి ప్రవేశిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషాన్ని తీసుకురావడానికి నైరుతి దిశలో ఎరుపు రంగు పిల్లిని ఉంచితే చాలా మంచిది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది