Vastu Tips : మీ సంపద పురోగతి పెరగాలి అనుకుంటున్నారా.! అయితే శ్రావణమాసంలో ఈ ఐదు రకాల పూల మొక్కలను నాటి చూడండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vastu Tips : మీ సంపద పురోగతి పెరగాలి అనుకుంటున్నారా.! అయితే శ్రావణమాసంలో ఈ ఐదు రకాల పూల మొక్కలను నాటి చూడండి…

 Authored By prabhas | The Telugu News | Updated on :22 July 2022,7:00 am

Vastu Tips : శ్రావణమాసం అంటే ఆ నెల మొత్తం, అందరూ ఆడవాళ్లు, అలాగే ప్రతి గృహం కళకళలాడుతూ ఉంటుంది. ఎందుకనగా ఈ శ్రావణమాసం అంటే లక్ష్మీదేవికి అలాగే విష్ణుమూర్తికి అలాగే తులసి అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ నెలలో 30 రోజులు కూడా కొందరు నిత్య పూజ చేస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం ప్రతి శుక్రవారం మ్రోతాన్ని చేసుకుంటూ ఉంటారు. ఆ తల్లి కి శుక్రవారం అంటే మహా పవిత్రమైన రోజు అన్నమాట ఈ నెలలో 4,నుంచి 5 శుక్రవారలు ఉంటాయి.
ఈ ఆషాడ మాసం వస్తుంది అంటే అందరూ వారి గృహములను శుభ్రపరచుకొని, గడపలకు పసుపు రాసి కుంకుమ బోట్లను పెట్టి, తోరణములు కట్టి ఇంటిని అలంకరించుకుంటూ ఉంటారు.

అలాగే శుక్రవారం రోజున లక్ష్మి దేవి అమ్మవారికి, ఎవరికి తోచినట్టుగా వారు తహతలతో పూజలు చేస్తూ ఉంటారు. ఆరోజున అమ్మవారిని పూలు, గాజులు బంగారం, పట్టు చీరలు, డబ్బులతో ఇలా రకరకాలుగా అలంకరించి తొమ్మిది రకాల పిండి వంటలు చేసి, పూలు, పండ్లతో పూజలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన, ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. అని అంటారు. అలాగే ఈ పూజలతో పాటు శ్రావణమాసంలో ఈ ఐదు రకాల పూల మొక్కలను నాటడం వలన, ఆ తల్లి అనుగ్రహం తప్పక కలుగుతుంది. అంట, ఆ మొక్కలు ఏంటో చూద్దాం..

vastu tips on these five plants in sravana masam for money flow and lucky

vastu tips on these five plants in sravana masam for money flow and lucky

1వది బిల్వ మొక్క: ఈ మొక్క అంటే శివుడికి చాలా ప్రత్యేకమైనది, ఈ మొక్క ఇంట్లో ఉండడం వలన సంపద పెరుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన మొక్కగా తెలిపారు.

2వది జమ్మి మొక్క: ఈ మొక్క ఈ శ్రావణమాసంలో లక్ష్మీదేవి పూజలలో ఈ ఆకులను ఉంచి పూజ చేస్తారు. అందుకే ఈ మొక్క ఇంట్లో ఉండడం వలన, గ్రహ దోషాలు తొలిగిపోతాయి. మీకు అన్ని మంచి రోజులు మొదలవుతాయి.

3వది సంపంగి మొక్క: ఈ మొక్క ఇంట్లో ఉండడం వలన అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే మీ అదృష్టం రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ మొక్క ఉండడం వలన మీ ఇంట్లో ధనం రావడం మొదలవుతుంది.

4వది జిల్లేడు మొక్క: ఈ మొక్క పూలు రెండు రకాలుగా ఉంటాయి. అయితే ఎరుపు పూలు ఉన్న మొక్క, అయితే ఇంటి బయట నాటాలి. తెలుపు రంగు పూలు ఉన్న మొక్క అయితే ఇంట్లో నాటుకోవాలి. ఈ మొక్క వలన నరదృష్టిలు అనేవి తొలిగిపోతాయి.

5వది ఉమ్మెత్త మొక్క: ఈ ఉమ్మెత్త మొక్క ఇంట్లో ఉండడం వలన కుటుంబంలో కలహాలు అలాగే కష్టాలు, తొలగిపోతాయి. అలాగే అనారోగ్యంతో బాధపడే వారికి కూడా ఈ మొక్క ఉండడం వలన వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే ఈ మొక్కను ఆయుర్వేదంలో కూడా వాడుతూ ఉంటారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది