Veerampalem Temple : ఇక్కడ గుడిలో శివలింగం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Veerampalem Temple : ఇక్కడ గుడిలో శివలింగం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది…!

Veerampalem Temple  : పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక సన్నిధానం వీరంపాలెంలో కొలువుదీరిన శివ పంచాయతన క్షేత్రం. తాడేపల్లిగూడెం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులు అనంతపల్లి వెళ్లే మార్గంలో చిరుతాడేపల్లి కడియ యొద్ద నీలాద్రిపురం మీదుగా చేరుకోవచ్చు.. ప్రకృతి రమణీయత మధ్య చక్కటి పల్లె వాతావరణం లో ఆహ్లాదకరంగా ఉండే ఈ ఆలయ సముదాయాన్ని బాల త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో 2003 సంవత్సరంలో కేవలం 99 రోజుల వ్యవధిలోనే […]

 Authored By tech | The Telugu News | Updated on :6 March 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Veerampalem Temple : ఇక్కడ గుడిలో శివలింగం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది...!

Veerampalem Temple  : పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక సన్నిధానం వీరంపాలెంలో కొలువుదీరిన శివ పంచాయతన క్షేత్రం. తాడేపల్లిగూడెం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులు అనంతపల్లి వెళ్లే మార్గంలో చిరుతాడేపల్లి కడియ యొద్ద నీలాద్రిపురం మీదుగా చేరుకోవచ్చు.. ప్రకృతి రమణీయత మధ్య చక్కటి పల్లె వాతావరణం లో ఆహ్లాదకరంగా ఉండే ఈ ఆలయ సముదాయాన్ని బాల త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో 2003 సంవత్సరంలో కేవలం 99 రోజుల వ్యవధిలోనే నిర్మించారు. హిందూ దేవతరాదన విధానంలో పంచాయతనానికి విశిష్ట స్థానం ఉంది ఐదుగురు దేవతామూర్తులకు ఒకే ప్రాములలో ప్రత్యేక పూజలు చేసే విధానాన్ని పంచాయతీలను అని అంటారు.

ఈ క్షేత్రంలోని గర్భాలయంలో విశ్లేషణుడు రుద్రాక్ష మండపంలో బాల లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ శివలింగాన్ని పవిత్ర నర్మదా నది నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చి ప్రతిష్టించారు. మేధా సరస్వతి ఆలయం రెండవ బాసరగా ప్రసిద్ధిగాంచింది. నిలువెత్తు సరస్వతి అమ్మవారి రూపం చూస్తూ భక్తులు అమ్మవారి సన్నిధిలో నిత్యం చిన్నపిల్లలకు సామూహికంగా అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి బాలా త్రిపుర సుందరీ దేవి సాయిబాబా మందిరాలు ఉన్నాయి. సువిశాలమైన ఆలయ సముదాయంలో అపురూప శిల్పాకృతిలో నలుదిక్కుల నిలువెత్తు భారీ విగ్రహాలు భక్తులను మంత్రముక్తులను చేస్తాయి. సరస్వతి దేవి ఆలయానికి అభిముఖంగా భారీ శివపార్వతుల విగ్రహం వారికి ఎదురుగా 42 అడుగుల అష్టముఖ గణపతి విగ్రహం చూసే కొద్దీ చూడాలనిపించేలా ఉంటాయి..

ఇక్కడ అరుదైన శివలింగాలను చూడొచ్చు.. ఈ ఆవరణలోనే దశావతారాలు వివిధ రూపాల్లో కొలువైన అమ్మవారి విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు.. ఈ పంచాయతీల క్షేత్రానికి మహాశివరాత్రి కార్తీక మాసం దేవీ నవరాత్రులు వంటి ముఖ్యమైన రోజులతో పాటు నిత్యం అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు. ఇక్కడ శివరాత్రి సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. నిత్యం ఇక్కడ భక్తులకు ఉచిత అన్నదానాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ హుండీలు దక్షిణలు తీసుకోవడం అనేది ఉండవు విరాళాలు కూడా స్వీకరించారు…

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది