Ganesha Statue : వినాయకుని విగ్రహం కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది…స్వప్న శాస్త్రం ఏం చెబుతుందంటే…!!
Ganesha Statue : హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం గణపతి జన్మదినం రోజును వినాయక చవితిగా భద్ర మాసం శుక్ల చతుర్థి రోజున జరుపుకుంటారు. అయితే ఈసారి వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకోనున్నారు. ఇక ఈ రోజున శివపార్వతుల తనయుడు గణేషుడు భూలోకానికి వచ్చి భక్తుల పూజలను అందుకుంటాడని హిందువుల నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ కూడా వినాయకుని సంబరాలలో […]
Ganesha Statue : హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం గణపతి జన్మదినం రోజును వినాయక చవితిగా భద్ర మాసం శుక్ల చతుర్థి రోజున జరుపుకుంటారు. అయితే ఈసారి వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకోనున్నారు. ఇక ఈ రోజున శివపార్వతుల తనయుడు గణేషుడు భూలోకానికి వచ్చి భక్తుల పూజలను అందుకుంటాడని హిందువుల నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ కూడా వినాయకుని సంబరాలలో పాల్గొని శాస్త్రీయంగా పూజిస్తారు. చవితి రోజు మొదలు చతుర్థి రోజు వరకు 10 రోజుల పాటు ఈ సంబరాలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ 10 రోజుల్లో వినాయకుడు మీ కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది.. స్వప్న శాస్త్రం ప్రకారం వినాయకుడు కలలో కనిపిస్తే మంచిదేనా… ?
ఎలాంటి వినాయకుడు కలలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వినాయకుడు కనిపించడం అనేది చాలా శుభప్రదం, అదృష్టానికి సంకేతం అని చెప్పవచ్చు. అయితే కలలో వినాయకుడు విగ్రహం కనిపించినట్లయితే ఆ భక్తుని ఇంట్లో త్వరలోనే ఒక శుభకార్యం జరగనుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఎలుక పై కూర్చున్న వినాయకుడు కనిపిస్తే… స్వప్న శాస్త్రం ప్రకారం ఎలుకపై కూర్చుని స్వారీ చేస్తున్న వినాయకుడు మన కలలో కనిపించినట్లయితే అది సిరిసంపదలకు సూచికగా పరిగణించవచ్చు. అంతేకాక ఆ ఇంట్లో త్వరలోనే ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగి ధన లాభం పొందుతారని అర్థం. అలాగే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఆనందం శాంతితో ఆహ్లాదంగా జీవిస్తారు.
బ్రహ్మ ముహూర్తంలో గణేశుడు కనిపిస్తే… తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ కలలోకి గణేశుడు వచ్చినట్లయితే మీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందినట్లు అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సమయంలో మీ ఇంట్లో లక్ష్మీదేవి కరుణతో సిరిసంపదలు కురుస్తాయి. వినాయకుని ఆశీస్సులతో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అలాగే ఉద్యోగ మరియు వ్యాపార రంగాల్లో ఉన్నవారు ఉన్నత అవకాశాలను సాధిస్తారు. వినాయకుడిని పూజిస్తున్నట్టుగా కలగంటే… కలలో గణేశుని పూజిస్తున్నట్లుగా కనిపిస్తే ఈ ఈ కల ఎంతో శుభ్రమైనదిగా స్వప్న శాస్త్రం లో పేర్కొనడం జరిగింది. ఇక ఈ కలకు గల అర్ధం త్వరలోనే మీ కోరికలన్నీ నెరవేరుతాయని అర్థం. వినాయకుని అనుగ్రహంతో జీవితంలోని దుఃఖాలు సమస్యలు అన్ని తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు .