Facial Astrology : ముఖ జ్యోతిష్యం అంటే ఏమిటి? మొహం చూసి నిజంగానే జాతకం చెప్పేస్తారా?
Facial Astrology : ముఖ జ్యోతిష్యాన్నే ఇంగ్లీషులో పేస్ రీడింగ్ అంటారు. దీనినే ‘భావసాముద్రికం’ అని కూడా వ్యవహరిస్తారు. ఈ జ్యోతిష్యం చెప్పే వారికి మనో జ్ఞానం సిక్త్స్ సెన్స్ ఉంటుంది. క వ్యక్తి ముఖ కవళికలను, కంటి చూపులోని శక్తినీ, మాట్లాడే పద్ధతిని, ఒక వ్యక్తి ముఖ కవళికలను, వస్త్ర ధారణనూ, పలు వరుసనూ, పెదాలనూ, కనుబొమ్మలనూ, భూజాల తీరునూ, నిలుచునే / కూర్చునే పద్ధతినీ ముందుగా ఒక ఆంచనా వేస్తారు. నవ్వే విధానం కూడా పరిశీలిస్తారు. మెడ పొడుగును చూపులతోనే కొలుస్తారు. చేతులను గాని చేతి రేఖలను గాని పరిశీలించరు. కొద్ది సమయం ఆలోచించుకొని మన జీవితం గురించి చెప్పటం మొదలు పెడతారు. మనలోని లోపాలను మనలోని విశేషాలను పుస్తకం చదివినట్లుగా చదివేస్తారు. దాదాపుగా ఎనభై శాతం నిజమే చెబుతారు.
అయితే, చెప్పేవాడు మంచి వాక్ శక్తి కలవాడై వుండాలి. వినేవారిని మంత్రముగ్ధులను చేయాలి. వినేవాని కళ్ళలోనికి బహుసూటిగా చూస్తూ సావధానంగా సందర్భోచితంగా స్థిర ప్రజ్ఞతో చెప్పాలి. చెప్పేటపుడు ఎదుటి వాని ముఖకవళికలను భావ ప్రకటనను గమనిస్తుండాలి. ఇదొక వశీకరణ విద్య లాంటిది. అనుభవమే దీని మంత్రం. మనో విజ్ఞానమే దీని యంత్రం. సాధన చేస్తూ పోతుండాలి. కొన్ని రోజులకు ఇది కైవశమవుతుంది. దీనికి తొందరపాటు వుండకూడదు. దీనినే మరికొందరు మరొక రకంగా కూడా చెబుతారు. తొమ్మిది సంఖ్యలలో ఒక సంఖ్యను, కొన్ని పూలలో ఒక పూవును, కొన్ని రంగులలో ఒక రంగును, కొన్ని రుచులలో ఒక రుచిని అడిగి తెల్సుకొంటారు.

what is facial astrology and doe the face really tell horoscope
తొమ్మిది సంఖ్యలలో ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క తత్వం వుంది. పూలను ఒక్కొక్క పూకు ఒక్కొక్క గుణం వుంది. రంగులలో ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క విశేషం వుంది. రుచులలో ఒక్కొక్క రుచికి ఒక్కొక్క ధర్మం వుంది. వీటన్నిటినీ కలబోసి విశ్లేషించి మన జీవిత నడవడికను చెబుతారు. ఇది కూడా నూటికి ఏనభైపాళ్ళు నిజమే కన్పిస్తున్నట్లుంటుంది. బాబాలు – స్వాములు – గురువులు- పై విధంగానే చెబుతుంటారు. ఇలా చెప్పటానికి మాయమంత్రం అక్కరలేదు. ఎదుటి మనిషిని అర్ధం చేసుకోగలిగిన కొంత సామర్థ్యం, కొంత మాటకారితనం వుంటే చాలు! శక్తి సామర్ధ్యాలు మాత్రమే చాలవు. వేషమూ, వేషానికి తగ్గ భాష వుంటేనే 96 నమ్మకం పుడుతుంది. వేషధారణను తుంది. ఇదొక తాంత్రిక విద్య.