Marriage : వివాహ సమయంలో చేసే హోమాలకి అర్థం ఏమిటి?
Marriage : మన హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అయితే భారతదేశం అంతటా… పెళ్లి తంతును చాలా వైభవంగా జరిపిస్తుంటారు. అయితే ఈ పెళ్లిళ్లను ఒక్కొక్కరు ఒక్కోలా… ఒక్కో చోట ఒక్కోలా నిర్వహించడం మనం చూస్తూనే ఉంటాం. కులాలు, మతాల వారిగా వారు చేసే పెళ్లిళ్లలో మార్పులు ఉంటాయి. అయితే చాలా మంది ఈ వివాహ క్రతువును చేసేటప్పుడు హోమాలు కాలుస్తుంటారు. ఆ తర్వాత అదే హోమ గుండం చుట్టూ ఏడడుగులు వేయిస్తుంటారు. ఈ విషయం మనకు తెలిసిందే. కానీ పెళ్లిలో హోమాలు ఎందుకు చేస్తారు. అసలు వివాహ సమయంలో చేసే పదహారు ఆజ్యహోమాలకి అర్థం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.తొలి హోమం వధువుని తొలుత పొందిన చంద్రునకు ఆహుతి దత్తం చేస్తారు.
ఆపై గంధర్వునకూ, అగ్ని హోత్రునకూ ఆహుతి దత్తం చేస్తారు. నాలుగో హోమం పితృ గృహం నుంచి భర్త గృహానికి పోవడానికి కన్యకా దీక్షను వదిలివేసినందుకు… ఆపై హోమం పితృ కులం వదలేసినట్లు భర్త కులాన్ని వదలకుండా ఉండేందుకు చేయిస్తారు. అలాగే ఆరవ హోమం ఇంద్రునికై సౌభాగ్య వతిగా సుపుత్రవతిగా చేయమని. ఆపై ఏడో హోమం అగ్ని దేవుడి గూర్చి వధువుకి కల్గిన సంతానాన్ని మృత్యువు నుంచి సదా రక్షించమని వధువుకి భవిష్యత్తులో పుత్ర శోకం కల్గనీయ వద్దని చేస్తారు. ఎనిమిదోది ఆజ్య హోమం కల్గిన సంతానానికి సంపూర్ణ ఆయుష్షు నిచ్చి ఆమెను సంతోషంగా ఉంచమని. తొమ్మిదో ఆజ్య హోమం శోకం దరిచేరకుండా, కన్నీరు కార్కకుండా భర్త, బిడ్డలను చూసుకుంటూ పరిపూర్ణ సంతోషం పందాలని.
పదవ హోమం వధువు మెడను నింగీ, వాయు దేవుడు, ఊరువులను, ఎదునూ అశ్వనీదేవతలూ, పుట్టబోయే సంతానాన్ని భానుడూ, ధరించిన వస్త్రాలను బృహస్పతీ, వెనుక భాగాన్ని దేవతలూ రక్షించాలని.పదకొండవ హోమం తెలిసీ తెలియక చేసిన పాపాలను క్షమించమని, వాటి నుంచి కల్గే దుఃఖాన్ని పోగట్టమని. అలాగే పన్నెండవ హోమం వరుణ దేవుడి కోసం, చల్లగా కాపాడమని. పదమూడో హోమం వరుణుడ్ని ప్రార్థించటం.. సమస్త కుటుంబ ఆయుర్ధాయమును బంఘ పరచకుండా, కోపం లేకుండా ప్రార్థనలని వినమని. పద్నాలుగోది అగ్ని హోత్రుడికై. పదిహేనవది దేవతలతో తొలి వాడైన అగ్నిదేవుడిని మా యజ్ఞయాగాదులందు హవిస్సుభుజించి ఆపై కోరికలు నెరవేర్చాలని… చివరగా పదహారవది హోమం అగ్నిహోత్రునికి మనసా వాచా ధ్యానిచి పూజించ నమస్కరించటం.